ఉదయం మొదలవ్వాలంటే కాఫీ కావాలనుకునే వారు చాలామందే ఉంటారు. కానీ ఎక్కువ మంది పాలకాఫీపై ఆధారపడుతుంటారు. అయితే తాజా అధ్యయనాలు చెబుతున్న దాన్ని చూస్తే ఇకపై అందరూ బ్లాక్ కాఫీ వైపు మళ్లే అవకాశం ఉంది. ఎందుకంటే ఇందులో ఆరోగ్యానికి మేలు చేసే అనేక రహస్యాలు దాగి ఉన్నాయట. ముఖ్యంగా దీర్ఘకాలిక ఆరోగ్యం, ఆయుష్షు పెంపు, గుండె సురక్షితంగా ఉండాలంటే.. ఇది మిరాకిల్ డ్రింక్ అనేంతగా పరిశోధకులు చెబుతున్నారు.
బ్లాక్ కాఫీలో పాలు, చక్కెర ఉండవు. దీంతో దీనిలో క్యాలరీలు చాలా తక్కువగా ఉంటాయి. ఇది డైట్‌లో ఉన్నవారికి సూపర్ బెనిఫిట్. అంతేకాదు, బ్లాక్ కాఫీలో కెఫిన్‌తో పాటు యాంటీ ఆక్సిడెంట్లు, బయోయాక్టివ్ కాంపౌండ్లు ఉండటంతో ఇది శరీరాన్ని లోపల నుంచి క్లీన్ చేసి, రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఒక అధ్యయనం ప్రకారం, రోజుకు 1 నుంచి 2 కప్పుల బ్లాక్ కాఫీ తాగేవారిలో గుండె జబ్బుల వల్ల మరణించే ప్రమాదం చాలా తక్కువగా ఉన్నట్టు తేలింది. జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్ అనే అంతర్జాతీయ పరిశోధనా పత్రికలో ప్రచురితమైన ఈ ఫైండింగ్స్ ప్రకారం, బ్లాక్ కాఫీ ఆరోగ్యంపై భారీ ప్రభావం చూపుతుంది.
ఇక బ్లాక్ కాఫీ మెటబాలిజాన్ని వేగంగా పనిచేసేలా చేస్తుంది. ఫ్యాట్ బర్న్ ప్రక్రియను ఉత్తేజితం చేస్తుంది. క్యాలరీలు తక్కువగా ఉండడం వల్ల డైట్ ఫాలో అవుతున్నవారికి ఇది సరైన డ్రింక్. పక్కా వెయిట్ లాస్ అవుతారని అంటున్నారు నిపుణులు. ఇది liver detoxకి కూడా బాగా ఉపయోగపడుతుంది. కాలేయంలో పేరుకుపోయే కొవ్వును క్రమంగా కరిగించి శుభ్రం చేస్తుంది. liver function మెరుగుపడటంతో శరీరం మొత్తం ఆరోగ్యంగా ఉంటుంది.
ఇందులో ఉండే కెఫిన్ నాడీ వ్యవస్థను ఉత్తేజితం చేస్తుంది. మెదడు ఫోకస్ పెరుగుతుంది. అలసట తగ్గుతుంది. ఉదయాన్నే బ్లాక్ కాఫీ తాగడం వల్ల మనలో ఉత్సాహం, ఉత్తేజం పెరుగుతాయి. ఎడ్రినలిన్ అనే హార్మోన్ విడుదల కావడంతో ఫిజికల్‌గా యాక్టివ్‌గా ఉండగలుగుతారు. బ్లాక్ కాఫీలో ఉండే యాంటీఆక్సిడెంట్లు శరీరంలో మంటను తగ్గిస్తాయి. సెల్స్‌ను ఫ్రీ రాడికల్స్ నుంచి కాపాడతాయి. దీని వల్ల క్యాన్సర్, మధుమేహం, గుండె సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం తక్కువవుతుంది.
ఇది ఎంత మంచిదైనా, మోతాదుకు మించి తాగకూడదు. రోజుకు 1 నుంచి 2 కప్పులు చాలు. మితంగా తీసుకుంటేనే దీని ప్రయోజనాలు పూర్తిగా పొందగలుగుతారు. రాత్రి సమయంలో తీసుకోవడం నిద్రపై ప్రభావం చూపవచ్చు. కనుక ఉదయం లేదా మధ్యాహ్నం సమయంలో తాగడం ఉత్తమం అంటున్నారు నిపుణులు.
