మనలో చాలామంది పాలకూర తినడానికి ఎంతో ఆసక్తి చూపుతారు. ఆకు కూరలు తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. పాలకూరను ఎక్కువగా తినడం వల్ల కొన్ని ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం అయితే ఉంటుందని చెప్పవచ్చు. పాలకూరలో ఉండే ఆక్సాలిక్ ఆమ్లం, ఫైటేట్లు అనే మూలకాలు కాల్షియం శోషణకు ఆటంకం కలిగించి ఎముకల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపే ఛాన్స్ అయితే ఉంటుంది.
పాలకూరను ఎక్కువగా తినడం వల్ల మూత్రపిండాలలో రాళ్లు వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. పాలకూరను పాలు, పెరుగు, కాటేజ్ చీజ్ మొదలైన వాటితో తినడం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తే అవకాశాలుంటాయి. పాలకూరకు అలెర్జీ ఉన్న వారికి వికారం, వాంతులు, విరేచనాలు లేదా కడుపు నొప్పి వంటి జీర్ణశయాంతర లక్షణాలు కనిపిస్తాయని చెప్పవచ్చు.
పాలకూరను పాలు, పెరుగు, కాటేజ్ చీజ్ మొదలైన వాటితో తినడం వల్ల ఆరోగ్యానికి తీవ్రస్థాయిలో నష్టం కలుగుతుందని చెప్పవచ్చు. పాలకూరను ఎక్కువగా తినడం వల్ల ఆరోగ్యానికి నష్టమే తప్ప లాభం ఉండదు. ఆకుపచ్చని ఆకుకూరలు ఆరోగ్యానికి ఎంత మేలు చేకూరుస్తాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పాలకూరని అత్యంత శ్రేష్ఠమైన వాటిలో ఒకటిగా పరిగణిస్తారనే సంగతి తెలిసిందే.
అత్యంత చౌక ధరలో సామాన్యుడికి కావాల్సిన సకల పోషకాలు అందించే ఆహార పదార్థాల్లో ఆకుకూరలలో పాలకూరది ప్రథమ స్థానమని చెప్పవచ్చు. కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడేవారు పాలకూరను పరిమిత పరిమాణంలో తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. పాలకూర వల్ల మలబద్ధకం, ఉబ్బరం, గ్యాస్ వంటి సమస్యలు పెరుగుతాయని చెప్పవచ్చు.