ఉప్పుతో చేసే ఈ పరిహారాల వల్ల ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తి తొలగిపోయి సంతోషాన్ని అందిస్తాయి..?

salt-shaker

సాధారణంగా ప్రతి మనిషి జీవితంలో ఏదో ఒక రూపంలో సమస్యలు చుట్టూముడుతూ ఉంటాయి. ఒక సమస్య తీరింది అని ప్రశాంతంగా ఊపిరి పీల్చుకునే లోపే ఏదో ఒక రూపంలో మరొక సమస్య వస్తూనే ఉంటుంది. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తి కారణంగా ఇటువంటి సమస్యలు తరుచు వేధిస్తూ ఉంటాయి. అయితే మన ఇంట్లో ఉండే ఉప్పుతో చేసే పరిహారాల వల్ల ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తి తొలగిపోయి సమస్యల నుండి విముక్తి లభిస్తుంది. ప్రతికూల శక్తిని తొలగించి సంతోషాన్ని కలిగించే పరిహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

వాస్తు శాస్త్రం ప్రకారం ఉప్పు పరిహారం చాలా ప్రభావంతమైన నివారణలలో ఒకటి. ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తి కారణంగా తరచూ సమస్యలు ఎదురవుతూ ఉంటే ఆ ప్రతికూల శక్తిని దూరం చేయడానికి ఇంటిని నీటితో తుడిచే సమయంలో ఆ నీటిలో చిటికెడు ఉప్పు, పసుపు కలిపి ఆ నీటితో ఇంటిని శుభ్రం చేయాలి. ఇలా చేయటం వల్ల ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తి తొలగిపోతుంది. అంతేకాకుండా సైన్స్ పరంగా ఇంట్లో ఉండే బ్యాక్టీరియా కూడా నాశనం చేస్తుంది. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ప్రతికూల శక్తి ఉన్నప్పుడు ఆ ఇంట్లో నివసించే సభ్యులు ఆర్థిక పరిస్థితి బలహీనంగా ఉంటుంది.అంతే కాకుండా అనేక ఆరోగ్య సమస్యలు కూడా వెంటాడుతూ ఉంటాయి.

ఇలా తరచుగా ఇంటి సభ్యులు అనారోగ్యానికి గురవుతూ బాధపడుతున్న సందర్భాలలో ఒక గాజు సీసాలో ఉప్పు నింపి మీ మంచం కింద మీరు తల పెట్టుకునే వైపు ఉంచాలి. ఇలా నెలకు ఒకసారి గాజు సీసాలో ఉప్పును మారుస్తూ ఉండాలి. ఇలా చేయటం వల్ల ఇంట్లో ఉన్న పెద్ద కుల శక్తి తొలగిపోయి ఆరోగ్య సమస్యలు దూరం అవుతాయి. వాస్తు దోషాలను తొలగించడానికి ఉప్పుకు సంబంధించిన కొన్ని నివారణలు చాలా ప్రభావంతంగా పనిచేస్తాయి.
వాస్తు దోషం పోవాలంటే గాజు గిన్నెలో ఉప్పు వేసి ఇంటిలో ఒక మూలన పెట్టడం మంచిది. ప్రతినెలా ఈ ఉప్పును మారుస్తూ ఉండాలి. ఇలా చేయటం వల్ల వాస్తు దోషాలు తొలగిపోయి ఇంట్లో ఆనందం, శాంతి, శ్రేయస్సుని తెస్తుంది. అలాగే ప్రతిరోజు స్నానం చేసే సమయంలో నీటిలో ఉప్పు కలిపి ఆ నీటితో స్నానం చేయటం వల్ల కూడా ఎటువంటి మానసిక సమస్యలు ఆరోగ్య సమస్యలు దరి చేరవు.