మెట్ల కింద వీటిని ఉంచితే నెగిటివ్ ఎనర్జీ వల్ల సమస్యలు మొదలవుతాయి…?

మన హిందూ సంస్కృతిలో వాస్తు శాస్త్రానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ప్రజలందరూ ఇప్పటికీ వాస్తు నియమాలను పాటిస్తూ ఇంటిని నిర్మించుకుంటున్నారు. వాస్తు ప్రకారం ఇంటిని నిర్మించుకోవడమే కాకుండా ఇంట్లో వస్తువులు కూడా వాస్తు ప్రకారం అమర్చుకోవటం వల్ల ఎటువంటి సమస్యలు తలెత్తవని నిపుణులు సూచిస్తున్నారు. అయితే కొంతమంది వాస్తవ నియమాలకు విరుద్ధంగా ఇంట్లో కొన్ని వస్తువులను అమర్చడం వల్ల అనేక సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. ముఖ్యంగా కొంతమంది మెట్ల కింద కొన్ని వస్తువులను ఉంచుతూ ఉంటారు. ఇలా చేయడం వల్ల ఇంట్లో ప్రతికూల శక్తి వల్ల అనేక సమస్యలు ఎదురవుతాయి. ఇంట్లో మెట్ల కింద ఏ ఏ వస్తువులను ఉంచకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

• దేవుడు మందిరం: సాధారణంగా ఇంట్లో మెట్ల కింద ఖాళీ స్థలం ఉండటంవల్ల చాలామంది అక్కడ దేవుడి మందిరాన్ని పెట్టుకుంటారు. అయితే ఇలా మనం నడిచే మెట్ల కింద దేవుడు మందిరాన్ని మందిరాన్ని ఉంచి పూజించడం వల్ల ఇంట్లో సానుకూల శక్తి తొలగిపోయి ప్రతికూల శక్తి ప్రవేశిస్తుంది. దీంతో ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య కలహాలు మొదలవుతాయి.

• షూ స్టాండ్: వాస్తు శాస్త్రం ప్రకారం షూ స్టాండ్ ని కూడా మెట్ల కింద ఉంచకూడదు. షూ, చెప్పులు వంటి వాటిని ఉంచితే నెగటివ్ ఎనర్జీ వచ్చి ఆర్థిక సమస్యలతో పాటు ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తుతాయి.

• లాకర్ వంటివి : చాలామంది ఇంటి లోపల మెట్టల్ని కట్టుకుంటూ ఉంటారు. అటువంటి వాళ్ళు సురక్షితంగా ఉంటుందని మెట్ల కింద లాకర్ పెట్టుకుంటారు. కానీ లక్ష్మీదేవి స్వరూపమైన డబ్బుని ఇలా మెట్ల కింద ఉంచటం వల్ల ఆ ఇంట్లో ఆర్థిక సమస్యలు తలెత్తి దరిద్రం చుట్టుకుంటుంది.

• కుళాయిలని : సాధారణంగా మెట్ల కింద ఖాళీ స్థలంలో బాత్రూం కడుతూ ఉంటారు. లేదంటే వాష్ బేసిన్ వంటి వాటిని పెడుతూ ఉంటారు. వాస్తు ప్రకారం మెట్ల కింద ఇలా నీటి కొళాయిని పెట్టరాదు. ఒకవేళ పెట్టినా కూడా నీరు లీక్ అవ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

• చెత్తబుట్ట: మెట్ల కింద చెత్తబుట్ట పెట్టటం వల్ల ఆ ఇంట్లో కి ప్రతికూల శక్తి ప్రవేశిస్తుంది.