ఈ వంట నూనెలు వాడితే ఆరోగ్య సమస్యలు వచ్చే ఛాన్స్ లేదట.. ఈ విషయాలు తెలుసా?

వంట నూనెలు అధికంగా లేదా తక్కువ నాణ్యత గలవి వాడితే అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. వంట నూనెలను ఎక్కువసేపు వేడి చేయడం, మళ్లీ వాడటం, కల్తీ నూనెలు వాడటం వంటివి ఆరోగ్యానికి హానికరమని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. అధిక నూనె వాడటం వల్ల బరువు పెరుగుతారు, ఇది ఊబకాయానికి దారితీస్తుంది. రిఫైన్డ్ ఆయిల్స్ వాడటం వల్ల రక్తంలో చెడు కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ పెరుగుతాయి, ఇది గుండె జబ్బులకు కారణమవుతుంది.

వంట నూనెలో కొన్ని కలుషితాలు ఉండవచ్చు, ఇవి క్యాన్సర్ కారకాలు కావచ్చు. కొన్ని వంట నూనెలు, ముఖ్యంగా ఆవనూనె అధికంగా తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలు వస్తాయి. ఆవనూనెలో ఉండే గోయిట్రోజెన్లు థైరాయిడ్ గ్రంథి పనితీరును దెబ్బతీస్తాయి. ఉపయోగించిన నూనెను సరిగ్గా వడకట్టి చల్లబరిచిన తర్వాత నిల్వ చేయకపోతే, క్లోస్ట్రిడియం బోటులినమ్ పెరుగుదల వల్ల బోటులిజం అనే ప్రాణాంతకమైన ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి.

కొవ్వు పదార్ధాలు అధికంగా ఉండే ఆహారాలు విరేచనాలకు కారణమవుతాయి. నూనెలను ఎక్కువగా వాడే వాళ్లు ఆరోగ్యం విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. నూనె వాడకాన్ని పరిమితం చేయడం వల్ల ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ చేకూరే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఆరోగ్యకరమైన నూనెలను (ఆలివ్ నూనె, అవకాడో నూనె) ఎంచుకోవడన్ ద్వారా హెల్త్ బెనిఫిట్స్ పొందవక్ఛు.

వంట నూనెను ఎక్కువసేపు వేడి చేయడం ఆరోగ్యానికి మంచిది కాదు. ఒకసారి వాడిన నూనెను మళ్లీ వాడటం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తే ఛాన్స్ అయితే ఉంటుంది. లూజ్ ఆయిల్స్, కల్తీ ఆయిల్స్ వాడటం వల్ల కొత్త ఆరోగ్య సమస్యలు తలెత్తే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు.