గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడానికి ఆరోగ్యకరమైన ఆహారం తినడం, వ్యాయామం చేయడం, ధూమపానం మానడం, తగినంత నిద్రపోవడం వంటి జీవనశైలి మార్పులు మంచి ఫలితాలను కలిగిస్తాయి. రోజుకు 6 గ్రాముల కంటే తక్కువ ఉప్పు తీసుకోవడం తీసుకోవడం ద్వారా గుండె సమస్యల బారిన పడే ఛాన్స్ తగ్గుతుంది. తృణధాన్యాలు, పండ్లు, కూరగాయలు, గింజలు, చిక్కుళ్ళు ఎక్కువగా తినడం ద్వారా ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి.
తక్కువ కొవ్వు ఉన్న పాల ఉత్పత్తులు మరియు సముద్ర ఆహారాలు మితంగా తీసుకోవడం ద్వారా హెల్త్ బెనిఫిట్స్ పొందవచ్చు. ట్రాన్స్ ఫ్యాట్స్ ఉన్న ఆహారాన్ని పరిమితంగా తీసుకుంటే మంచిది. ప్రోటీన్ యొక్క ఆరోగ్యకరమైన మూలాలను ఎంచుకోవడం ద్వారా మెరుగైన ఫలితాలు ఉంటాయి. వారానికి కనీసం 150 నిమిషాలు తేలికపాటి నుండి మితమైన కార్యాచరణ చేయడం ద్వారా మంచి ఫలితాలు పొందవచ్చు.
కండరాల సామర్థ్యాన్ని మెరుగుపరిచే వ్యాయామాలు చేయడం ద్వారా ఆరోగ్య సమస్యల బారిన పడకుండా రక్షించుకోవచ్చు. గుండెపై అదనపు భారాన్ని కలిగించే ఒత్తిడి హార్మోన్లను ఇది తగ్గిస్తుంది. శరీరం అరోగ్యంగా సరైన ఆహారపు అలవాట్లను పాటించడంతో పాటు మంచి జీవనశైలిని కలిగి ఉండాలి. ఇందుకోసం ఉదయాన్నే సరైన సమయంలో నిద్ర లేవాలి.
సరైన దినచర్యను పాటించడం ద్వారా ఒత్తిడి తగ్గుతుంది. తగినంత మంచి నీరు త్రాగడంతో పాటు ప్రతిరోజూ వ్యాయామం చేయడం ద్వారా బ్లడ్ ప్రెజర్ ను కంట్రోల్ చేయవచ్చు. ఉదయం సమయంలో వ్యాయామం చేస్తే మంచి ఫలితాలు ఉంటాయని చెప్పవచ్చు.