మీ ఎముకలు బలంగా ఉండాలనుకుంటున్నారా? తినాల్సిన, తినకూడని అహారాలివే!

ఈ మధ్య కాలంలో చాలామంది ఎముకలకు సంబంధించిన సమస్యలతో బాధ పడుతున్నారు. ఎముకలు బలంగా ఉండాలంటే కాల్షియం, విటమిన్ డి సమృద్ధిగా ఉండే ఆహారం తీసుకోవాలి, వ్యాయామం చేయాలి, మరియు ఎండలో కొంత సమయం గడపాలి. పాలు, పెరుగు, చీజ్, ఇతర పాల ఉత్పత్తులు, బ్రోకలీ, క్యాబేజీ, బెండకాయ ఆకుకూరలు తీసుకోవడం ద్వారా ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి.

సోయాబీన్స్, చేపలు, మాంసాహారం తీసుకోవడం, అంజీర్, కివి, బొప్పాయి, నేరేడు వంటి పండ్లు తినడం ద్వారా ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. బరువు మోసే వ్యాయామాలు (నడక, జాగింగ్) చేయడం ద్వారా ఎముకలు దృఢంగా మారతాయి. విటమిన్ డి పొందడానికి ఉదయం, సాయంత్రం పూట కొంత సేపు ఎండలో సమయం గడిపితే మంచిది. బాల్యంలో ఎముకలు దృఢంగా ఉండటానికి పోషకాలు తీసుకోవడం ముఖ్యం అని చెప్పవచ్చు.

పుష్కలంగా పండ్లు మరియు కూరగాయలు, తృణధాన్యాలు, లీన్ ప్రోటీన్ మరియు తక్కువ కొవ్వు పాల ఉత్పత్తులతో సహా ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం ద్వారా ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. ఎక్కువ మొత్తంలో చక్కెర తీసుకుంటే అరోగ్యానికి హాని కలుగుతుంది. టీ, కాఫీ, కూల్ డ్రింక్స్ తీసుకుంటే కూడా శరీరంలో కాల్షియం లెవెల్స్ తగ్గే అవకాశాలు అయితే ఉంటాయి.

మద్యం తాగే అలవాటు ఉంటే కూడా శరీరం బలహీనపడే ఛాన్స్ ఎక్కువగా ఉంటుందని చెప్పవచ్చు. పాలు, పెరుగు, చీజ్ ఎంత ఎక్కువగా తీసుకుంటే ఆరోగ్యానికి అంత మంచిది. గ్రీన్ టీ ఎక్కువగా తీసుకోవడం ద్వారా ఎముకల్లో బలం పెరుగుతుంది. కొబ్బరి నీళ్లు ఎముకలు దృఢంగా ఉంచడంలో తోడ్పడతాయి. ఎముకలు బలంగా ఉండాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి.