ప్రస్తుత కాలంలో కీళ్ల నొప్పులతో బాధ పడే బాధితుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ప్రధానంగా కొన్ని ఆహారాలు తీసుకోవడం, వ్యాయామం చేయకపోవడం, కీళ్ల నొప్పుల వ్యాధికి కారణమవుతుందని చెప్పవచ్చు. అయితే కొన్ని ఆహారాలు తీసుకోవడం ద్వారా కీళ్ల నొప్పులు వచ్చే అవకాశాలు పెరుగుతాయి. ఈ సమస్య ఎక్కువగా వేధిస్తుంటే మాత్రం కొన్ని ఆహారాలకు దూరంగా ఉండాలి.
రెడ్ మీట్ కీళ్ల నొప్పుల రిస్క్ ను పెంచుతుందని చెప్పవచ్చు. ఈ సమస్యతో బాధ పడేవాళ్లు రెడ్ మీట్ కు వీలైనంత దూరంగా ఉండాలి. రెడ్ మీట్ లో ఉండే ప్యూరిన్స్ కీళ్ల నొప్పులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా కారణమయ్యే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. చేపలు, రొయ్యలు ఆరోగ్యానికి మంచివే అయినా ఇవి కూడా కీళ్ల నొప్పులకు కారణం అయ్యే ఛాన్స్ అయితే ఉంది.
చేపలు, రొయ్యలలో ప్యూరిన్స్ ఎక్కువగా ఉండటం వల్ల ఇవి కూడా తీవ్రమైన నొప్పులను కలిగిస్తాయని చెప్పవచ్చు. ప్రతిరోజూ టీ తాగడం, చక్కెర ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల కూడా కీళ్ల నొప్పులు వచ్చే ఛాన్స్ ఉంటుంది. కీళ్ల నొప్పుల రిస్క్ పెంచే ఆహారాలలో ఉప్పు ఎక్కువగా ఉన్న అహారాలు సైతం ఉంటాయి. తగినంత నీళ్లు తాగడం ద్వారా కూడా ఈ సమస్య దూరమవుతుందని చెప్పవచ్చు.
వయస్సుకు అనుగుణంగా తీసుకునే ఆహారంలో మార్పులు చేసుకోవడం ద్వారా మంచి ఫలితాలను పొందవచ్చు. ఇన్ ఫ్లమేటరీ ఫుడ్స్ కు దూరంగా ఉండటం వల్ల ఆరోగ్య సమస్యల బారిన పడకుండా మనల్ని మనం రక్షించుకోవచ్చు. అరటిపండ్లు, రాగులు, జొన్నలు, సజ్జలు, పసుపు, పాలు, బ్లూ బెర్రీలు, గ్రీన్ టీ తీసుకోవడం ద్వారా ఈ సమస్యలు దూరమయ్యే ఛాన్స్ ఉంటుంది.