ఈ ఆహారాలు తింటే విషం కంటే ఎక్కువ ప్రమాదమట.. ఈ ఆహారాలు ఏంటంటే?

మనలో చాలామంది తినే తిండి విషయంలో రుచికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారనే సంగతి తెలిసిందే. సరైన ఆహారం తీసుకోవడం ద్వారా శరీరానికి అవసరమైన శక్తి లభిస్తుంది. రిఫైండ్ నూనె, స్నాక్స్, జామ్, సాస్, జ్యూసులు తాగడం వల్ల కొత్త ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. వినడానికి ఆశ్చర్యంగా అనిపించినా వీటితో చేసిన ఆహారాలు విషం కంటే ప్రమాదం అని చెప్పడంలో సందేహం అక్కర్లేదు.

ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరూ వంటకాల కోసం రిఫైండ్ అయిల్ ను వాడుతున్నారు. ఈ ఆయిల్ లో పోషకాలు తక్కువగా ఉంటాయనే సంగతి తెలిసిందే. ఈ ఆయిల్ లో ట్రాన్స్ ఫ్యాట్స్, సంతృప్త కొవ్వులు ఎక్కువగా ఉంటాయని చెప్పవచ్చు. కేలరీల పరిమాణం సైతం ఇందులో ఎక్కువగా ఉంటుంది. రిఫైండ్ ఆయిల్ తో పోలిస్తే ఆవ నూనెను వంటలో వాడటం వల్ల ఎక్కువ హెల్ట్ బెనిఫిట్స్ కలుగుతాయి.

ప్రస్తుత కాలంలో చాలామంది వేయించిన స్నాక్స్ ను ఇష్టంగా తీసుకుంటున్నారు. వేయించిన ఆహారాలు తింటే ఊబకాయం, క్యాన్సర్, చెడు కొలెస్ట్రాల్ పెరగడం, జీర్ణక్రియ, మెదడుకు సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. పిల్లలను స్నాక్స్ కు ఎంత దూరంగా ఉంచితే ఆరోగ్యానికి అంత మంచిదని చెప్పవచ్చు. మనలో చాలామంది జ్యూసులు ఇష్టంగా తాగుతారు.

కొంతమంది ఇన్స్టంట్ జ్యూసులు తాగుతారు. వీటి వల్ల ఆరోగ్యానికి నష్టం తప్ప లాభం ఉండదు. కృత్రిమ రంగులు, కృత్రిమ చక్కెరలు ఎక్కువగా ఉండే జ్యూసులు ఆరోగ్యానికి తీవ్రస్థాయిలో నష్టం కలిగిస్తాయి. బ్రెడ్, బిస్కెట్స్ తినడానికి చాలామంది జామ్ లేదా సాస్ వాడతారు. చక్కెర శాతం, సోడియం, కృత్రిమ రంగులు ఎక్కువగా ఉన్న వీటిని తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో నష్టమని చెప్పవచ్చు. చక్కెర ఎక్కువగా తీసుకుంటే కూడా ఆరోగ్యానికి ఎంతో కష్టం కలిగే ఛాన్స్ ఉంటుంది.