మన శరీరంలోని ముఖ్యమైన అవయవాలలో లివర్ ఒకటి కాగా లివర్ ఆరోగ్యంగా ఉంటే ఎన్నో ఆరోగ్య సమస్యలు దూరమయ్యే ఛాన్స్ అయితే ఉంది. లివర్ ని ఆరోగ్యంగా ఉంచడానికి, ఆకుకూరలు, ఒమేగా-3 చేపలు, గింజలు, పసుపు, గ్రీన్ టీ, సిట్రస్ పండ్లు, బొప్పాయి, ద్రాక్ష, బ్రోకలీ, కాలీఫ్లవర్, పాలకూర, ఓట్స్, బీన్స్ వంటి ఆహారాలు చాలా ఉపయోగపడతాయి. పాలకూర, బ్రోకలీ, కాలీఫ్లవర్ వంటి ఆకుకూరలు లివర్ కు చాలా మేలు చేస్తాయని చెప్పవచ్చు.
ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ లివర్ పనితీరును మెరుగుపరిచే ఛాన్స్ అయితే ఉంటుంది. వాల్‌నట్స్, అవిసె గింజలు వంటి గింజలు లివర్ కు ఎంతో మేలు చేస్తాయి పసుపులో ఉండే కర్కుమిన్ లివర్ కు మేలు చేస్తుందని చెప్పవచ్చు. గ్రీన్ టీ యాంటీఆక్సిడెంట్లు కలిగి ఉంటుందనే సంగతి తెలిసిందే. ప్రతిరోజూ గ్రీన్ టీ తాగడం వల్ల కాలేయానికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయని చెప్పవచ్చు.
నిమ్మకాయలు, నారింజ, ద్రాక్షపండ్లు వంటి సిట్రస్ పండ్లు లివర్ కు మేలు చేస్తాయి. అయితే ఈ పండ్లు కిడ్నీలకు హాని చేస్తాయి కాబట్టి వీటిని పరిమితంగా తీసుకుంటే మంచిది. బొప్పాయి లివర్ లో ఉండే చెడు కొలెస్ట్రాల్ ని బయటకు పంపడంలో సహాయపడుతుంది. ద్రాక్ష లివర్ ఇన్ఫ్లమేషన్ ని తగ్గించనుండగా ఓట్స్ లివర్ కి ఎంతో మేలు చేస్తుందని చెప్పవచ్చు.
ఫైబర్ అధికంగా ఉండే బీన్స్ లివర్ కి మేలు చేసే విషయంలో సహాయపడతాయి. కాఫీ, డ్రై ఫ్రూట్స్ కూడా లివర్ కు మేలు చేస్తాయని చెప్పవచ్చు. కాలేయం విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే దీర్ఘకాలంలో ఎన్నో ఇబ్బందులు తలెత్తే అవకాశాలు అయితే ఉంటాయి. లివర్ ఆరోగ్యంగా ఉంచుకోవాలని భావించే వాళ్లు ఈ విషయాలను గుర్తించుకోవాలి.