ఈ మధ్య కాలంలో పిల్లల ఆహారపు అలవాట్లు శరవేగంగా మారిపోతున్నాయి. తల్లీదండ్రులు తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల పిల్లలు ఇష్టానుసారం ఆహారం తీసుకుంటున్నారు. అయితే చిన్నపిల్లలకు కొన్ని రకాల ఆహారాలు ఏ మాత్రం మంచివి కావు. ఈ ఆహారాల వల్ల లాభం కంటే నష్టం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఐదేళ్ల లోపు పిల్లలు టీ, కాఫీలకు దూరంగా ఉంటే మంచిది.
టీ, కాఫీలు పిల్లల నాడీ వ్యవస్థపై తీవ్రమైన ప్రభావం చూపే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. ప్రాసెస్ చేసిన ఆహారాలు, నాన్ వెజ్ వంటకాలు పిల్లలకు మంచివి కావు. ఎక్కువ మొత్తంలో సోడియం, అనారోగ్యకరమైన కొవ్వులు ఉన్న ఆహారం పిల్లలకు ఇవ్వడం వల్ల పిల్లలకు కొత్త ఆరోగ్య సమస్యలు వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఫ్రెంచ్ ఫ్రైస్, నూనెలో వేయించిన ఆహారాలు పిల్లల ఆరోగ్యానికి ఏ మాత్రం మంచివి కావు.
చక్కెర ఎక్కువగా ఉండే ఆహారాలు సైతం పిల్లలకు ఏ మాత్రం మంచివి కావు. ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్ లకు పిల్లల్ని దూరంగా ఉంచితే మంచిది. రుచి ఉన్న వంటకాల కంటే పోషకాలు ఉన్న వంటకాలకు తల్లీదండ్రులు ప్రాధాన్యత ఇస్తే మంచిది. పిల్లల ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే మాత్రం దీర్ఘకాలంలో ఎన్నో ఇబ్బందులు తప్పవని చెప్పవచ్చు.
చిన్న పిల్లలకు ఎక్కువ మొత్తంలో పోషకాలు ఉన్న ఆహారం ఇవ్వడం ద్వారా భవిష్యత్తులో వాళ్లకు ఏవైనా ఆరోగ్య సమస్యలు వచ్చినా ఆ సమస్యలను సులువుగానే అధిగమించే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. పిల్లలు జంక్ ఫుడ్ కు వీలైనంత దూరంగా ఉంటే ఆరోగ్యానికి మేలు జరుగుతుందని చెప్పవచ్చు.