మనలో చాలామంది ఎంతో ఇష్టంగా చపాతీలను తింటారు. చపాతీలు రుచిగా ఉండటంతో పాటు చపాతీలు తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. అయితే చపాతీలతో పోల్చి చూస్తే కొన్ని వంటకాలు తినడం వల్ల ఎక్కువ బెనిఫిట్స్ లభిస్తాయి. రాగి రొట్టెలు తినడం ద్వారా శరీరానికి అవసరమైన కాల్షియం, ప్రోటీన్, ఫైబర్ లభిస్తాయని చెప్పవచ్చు. రాగి రొట్టెల్లో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది కాబట్టి షుగర్ సైతం కంట్రోల్ లో ఉంటుంది.
సజ్జలతో చేసిన రొట్టెలు తినడం వల్ల కూడా హెల్త్ బెనిఫిట్స్ లభిస్తాయి. సజ్జలలో ఐరన్ తో పాటు ప్రోటీన్, ఫైబర్ కూడా లభిస్తాయి. జొన్న రొట్టెలలో గ్లూటెన్ ఉండదని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. జొన్న రొట్టెలు తినడం ద్వారా శరీరానికి అవసరమైన ప్రోటీన్, ఫైబర్, మెగ్నీషియం లభిస్తాయి. జొన్నరొట్టెలు తినడానికి రుచిగా కూడా ఉంటాయని చెప్పవచ్చు.
చపాతీలకు మంచి ప్రత్యామ్నాయం ఓట్స్ కాగా బీటా గ్లూకాన్స్, ఫైబర్, ప్రోటీన్ వీటి ద్వారా లభిస్తాయి. చపాతీలతో పోల్చి చూస్తే శనగలు మెరుగైనవి కాగా శనగలు రుచిగా ఉండటంతో పాటు వీటిలో గ్లూటెన్ కూడా ఉండదు. అయితే ఇవి తినే అవకాశం లేని వాళ్లు మాత్రం చపాతీలపై దృష్టి పెడితే మంచిది. చపాతీలు తినడం వల్ల ఆరోగ్యానికి లాభాలే తప్ప నష్టాలు లేవనే సంగతి తెలిసిందే.
చపాతీలను నూనె లేకుండా కాల్చితే వాటిని పుల్కాలు అంటారు. పంజాబ్ లాంటి రాష్ట్రాలలో చపాతి ప్రధాన ఆహారం అనే సంగతి తెలిసిందే. చపాతీలను ఎక్కువగా తీసుకుంటే దీర్ఘకాలంలో మంచి ప్రయోజనాలు కలుగుతాయి. అయితే మైదా మిక్స్ చేసిన చపాతీలను తినడం ఆరోగ్యానికి మంచిది కాదు.
