కిడ్నీ ఆరోగ్యానికి, తక్కువ సోడియం, పొటాషియం మరియు ఫాస్ఫరస్ ఉండే ఆహారాలు, అలాగే తగినంత నీరు తీసుకోవడం ముఖ్యం. ఆకుకూరలు, కొన్ని పండ్లు, తృణధాన్యాలు, చేపలు మరియు గుడ్లు కిడ్నీకి మంచివి. యాపిల్, ద్రాక్ష, స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీ, చెర్రీ, పైనాపిల్ కిడ్నీలకు ఎంతో మేలు చేస్తాయని చెప్పవచ్చు. లెట్యూస్, గ్రీన్ బీన్స్, దోసకాయలు, క్యారెట్లు, కాలీఫ్లవర్, బఠానీలు, గుమ్మడికాయ తీసుకోవడం ద్వారా కిడ్నీలకు ప్రయోజనం చేకూరుతుంది
చికెన్, చేపలు, గుడ్డులోని తెల్లసొన సైతం కిడ్నీల ఆరోగ్యానికి మంచివి. బ్రౌన్ రైస్, క్వినోవా కిడ్నీని ఆరోగ్యంగా ఉంచడంలో తోడ్పడతాయి. పాలకూర, క్యారెట్, బీట్రూట్, బ్రోకలీ తీసుకోవడం ద్వారా కిడ్నీలకు సంబంధించిన సమస్యలు తలెత్తే అవకాశాలు అయితే ఉండవు. వెల్లుల్లి, ఉల్లిపాయలు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలతో కిడ్నీకి మేలు చేస్తాయి.
కిడ్నీ రాళ్లను నివారించడానికి మరియు కిడ్నీ పనితీరును మెరుగుపరచడానికి తగినంత నీరు తాగాలి. ప్రాసెస్ చేయబడిన ఆహారాలు, ఉప్పు, సోడియం ఎక్కువగా ఉన్న మసాలాలు ఆరోగ్యానికి మంచివి. బంగాళాదుంపలు, బొప్పాయి, ఆరెంజ్, టొమాటో, బ్రొకలీ ఆరోగ్యానికి మేలు చేస్తాయి. పాల ఉత్పత్తులు, ఎర్ర మాంసం ఎక్కువ మొత్తంలో తీసుకుంటే పాస్పరస శరీరంలో ఎక్కువగా చేరుతుంది.
వేయించిన ఆహారాలు, అధిక కొవ్వుతో కూడిన పాల ఉత్పత్తులు తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది. మూత్రపిండాల వ్యాధి ఉన్నవారికి, ఆహారంలో ప్రోటీన్ తీసుకోవడం పరిమితం చేయాలి. మీ వైద్యుడు లేదా డైటీషియన్ మీకు సరైన ఆహారం మరియు ప్రోటీన్ తీసుకోవలసిన పరిమాణాన్ని సూచించడం జరుగుతుంది. శరీరంలో విష పదార్థాలను తొలగించడంలో కిడ్నీలు ఉపయోగపడతాయి. పసుపు, కాలీఫ్లవర్, వెల్లుల్లి, యాపిల్స్, ఆలివ్ నూనె కిడ్నీలకు మేలు చేయడంలో ఉపయోగపడతాయి.