మనలో చాలామంది ఆహారాన్ని ఎంతో ఇష్టంగా తింటారు. సరైన సమయంలో ఆహారాన్ని తీసుకోవడం వల్ల హెల్తీగా ఉంటామని చాలామంది ఫీలవుతారు. అయితే కొంతమంది మాత్రం ఆహారం తిన్న తర్వాత కూడా నీరసంగా ఫీలవుతూ ఉంటారు. ఈ తరహా సమస్యతో బాధ పడుతుంటే మీరు పోస్ట్ మీల్ ఫ్యాటిగ్ సమస్యతో బాధ పడుతున్నారని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది.
ఆహారంలో పోషకాలు లోపిస్తే ఈ సమస్య బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సాధారణంగా ఆహారం తీసుకున్న తర్వాత రక్త ప్రసరణ పెరుగుతుంది. ఆహారం జీర్ణమయ్యే సమయంలో మన శరీరంలో సెరటోనిన్ అనే హార్మోన్ విడుదలై నిద్రను కలిగిస్తుంది. ఎప్పుడో ఒకసారి ఆహారం తీసుకున్న తర్వాత నిద్ర వస్తే ఏమీ కాదని ఆలా కాకుండా ప్రతిరోజూ అలాంటి భావన కలిగితే మాత్రం ఇబ్బందేనని తెలుస్తోంది.
ప్రస్తుతం చాలామంది ప్రాసెస్డ్, రిఫైన్డ్ ఆహారాలను తీసుకుంటున్నారు. అయితే ఇలాంటి ఆహారాలను తీసుకోవడం వల్ల శరీరానికి కావాల్సిన పోషకాలు లభించే ఛాన్స్ అయితే ఉండదు. కార్బోహైడ్రేట్స్, ప్రొటీన్స్, కొవ్వులతో పాటు విటమిన్స్, మినరల్స్ కచ్చితంగా ఉండే ఆహారాలను తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది. శాకాహార, మాంసాహారాల్లో లభించే ప్రోటీన్లు కండరాల రిపేర్‌కు, శక్తి ఉత్పత్తిలో కీలక పాత్ర పోషిస్తాయని చెప్పవచ్చు.
విటమిన్ డీ, విటమిన్ బీ, ఐరన్, జింక్, సెలీనియమ్, మెగ్నీషియమ్, ఐయోడిన్ వంటి వాటిని మైక్రోన్యూట్రియంట్స్ అని పిలుస్తారు. మన శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే ఈ పోషకాలు ఎంతో అవసరం అని చెప్పవచ్చు.