మీ వయస్సు 30 ఏళ్లు దాటిందా.. ఈ పరీక్షలు మాత్రం కచ్చితంగా చేయించుకోవాల్సిందే!

ఈ మధ్య కాలంలో చాలామందిని చిన్న వయస్సులోనే ఎన్నో దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు వేధిస్తున్నాయి. అయితే 30 ఏళ్లు దాటిన వాళ్లు కొన్ని పరీక్షలు కచ్చితంగా చేయించుకోవాల్సి ఉంటుంది. స్త్రీలు ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి పాప్ స్మియర్ పరీక్ష చేయించుకోవాలి. ఈ పరీక్ష గర్భాశయ క్యాన్సర్ కు సంబంధించిన పరీక్ష కావడం గమనార్హం. హెచ్ పివి పరీక్ష కూడా గర్భాశయ క్యాన్సర్ ను గుర్తించడానికి ఉపయోగపడుతుంది.

షుగర్, హైపర్ టెన్షన్, కొలెస్ట్రాల్ పరీక్షలను సైతం చేయించుకోవడం ద్వారా కొత్త సమస్యల బారిన పడకుండా మనల్ని మనం రక్షించుకోవచ్చు. ఊబకాయంతో బాధ పడేవాళ్లు బీఎంఐ్ ఆధారంగా బరువు విషయంలో జాగ్రత్త వహిస్తే మంచిది. పీరియడ్స్ ఆగిపోయిన తర్వాత మహిళలు బోలు ఎముకల పరీక్ష చేసుకోవాలి. 30 ఏళ్ల తర్వాత క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం వల్ల అనారోగ్యాలను ముందస్తుగా గుర్తించవచ్చు.

థైరాయిడ్ ఫంక్షన్ టెస్ట్, కిడ్నీ ఫంక్షన్ టెస్ట్, కాలేయ పనితీరు పరీక్ష, మామోగ్రఫీ, రక్తహీనత పరీక్ష, ఎముకల బలహీనత పరీక్ష, విటమిన్ ద్, కాల్షియం లోపం పరీక్ష, విటమిన్ బీ12 లోపం పరీక్ష చేయించుకోవాలి. 50 ఏళ్లు వయస్సు పైబడిన వారు లంగ్స్, క్యాన్సర్ పరీక్షలు చేయించుకుంటే మంచిది.

30 నుంచి 40 ఏళ్లు దాటిన మహిళలకు రొమ్ముక్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువ. కాబట్టి, ఈ వయసులో మహిళలు రొమ్ము పరీక్ష చేయించుకోవాలి. 35 ఏళ్ల తర్వాత ప్రతి ఐదేళ్లకు ఒకసారి ఎముక సాంద్రత పరీక్ష చేయించుకోవడం మంచిది. ఈ పరీక్షలు చేయించుకోవడం ద్వారా కొత్త ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు అయితే తగ్గుతాయి.