మనలో చాలామంది తమకు నచ్చిన ఆహారాన్ని ఎంతో ఇష్టంగా తినడానికి ఆసక్తి చూపిస్తారు. కొన్ని ఆహారాలు ఆరోగ్యానికి మంచివే అయినా మరికొన్ని ఆహారాలు మాత్రం ఆరోగ్యానికి హాని కలిగిస్తాయని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అవసరం లేదు. మన దేశ ప్రజలు ఇష్టపడే కొన్ని టిఫిన్ల వల్ల ఆరోగ్యానికి లాభం కంటే నష్టమే ఎక్కువని వైద్య నిపుణులు వెల్లడిస్తూ ఉండటం గమనార్హం.
మైదా సంబంధిత ఉత్పత్తులను మన దేశ ప్రజలు ఎక్కువగా వినియోగిస్తారు. అయితే మైదా వల్ల ఆరోగ్యానికి నష్టమే తప్ప లాభం లేదని చెప్పవచ్చు. సమోసా ఎక్కువగా తినడం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తే అవకాశాలు అయితే ఉంటాయి. ప్రతిరోజూ ఇడ్లీ తినడం కూడా ఆరోగ్యానికి మంచిది కాదు. ఇడ్లీ వేగంగా జీర్ణం కావడంతో పాటు వేగంగా షుగర్ లెవెల్స్ ను పెంచుతుందని చెప్పవచ్చు.
ఉదయాన్నే పూరీ తినడం కూడా ఆరోగ్యానికి నష్టం చేస్తుంది. పూరీ ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో చెడు కొలస్ట్రాల్ పెరుగుతుంది. పూరీ తీసుకోవడం వల్ల శరీరంలో క్యాలరీలు పెరిగే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. మైదాతో చేసిన బోండాలు తీసుకోవడం వల్ల కూడా ఆరోగ్యానికి లాభం కంటే నష్టం ఎక్కువగా కలుగుతుంది.
ఉదయం సమయంలో చాలామంది నూడిల్స్ తీసుకుంటూ ఉంటారు. నూడిల్స్ తినడం వల్ల శరీరంలో ట్రాన్స్ ఫ్యాట్స్ పెరిగే ఛాన్స్ ఉంటుంది. చోలే బతూరే, ఆలూ పరాటా కూడా ఆరోగ్యానికి మంచివి కావు. ఇవి తీసుకుంటే ఆరోగ్యానికి నష్టం కలిగే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయని చెప్పవచ్చు.
