మనలో చాలామంది ఏదో ఒక సందర్భంలో ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యల వల్ల ఇబ్బందులు పడి ఉంటారు. ఊపిరితిత్తుల సమస్యల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కొన్నిసార్లు ప్రాణాలకే ప్రమాదం కలిగే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. మనిషి శరీరంలో ముఖ్యంగా ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలు ఇతర సమస్యలకు భిన్నంగా ఉంటాయని చెప్పడంలో సందేహం అక్కర్లేదు.
ఊపిరితిత్తుల సమస్యల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఆరోగ్యానికి మంచిది. మనం ఏ లక్షణాలను నిర్లక్ష్యం చేస్తామో ఆ లక్షణాలే అవే ప్రాణాలకు హాని చేసే అవకాశాలు అయితే ఉంటాయి. ఒక నెల లేదా అంతకంటే ఎక్కువ కాలం పాటు భరించలేని ఛాతి నొప్పి, ప్రత్యేకించి ఊపిరి పీల్చినప్పుడు దగ్గు వస్తే వెంటనే వైద్యులను సంప్రదించి చికిత్స చేయించుకుంటే ఆరోగ్యానికి మేలు జరుగుతుంది.
దీర్ఘకాలిక కఫం అనేది అంటువ్యాధుల కారణంగా వస్తుందనే సంగతి తెలిసిందే. దీర్ఘకాలిక కఫం సమస్య ఎక్కువ రోజుల నుంచి వేధిస్తుంటే ఊపిరితిత్తులు వ్యాధి బారిన పడినట్లే అని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. డైటింగ్, వ్యాయామం చేయకుండానే మీ శరీర బరువు తగ్గుతున్నట్లయితే ఆ సమస్య కూడా అనారోగ్య సమస్య అవుతుంది. బరువు తగ్గడం అనేది శరీరం పంపుతున్న సంకేతంగా భావించాల్సి ఉంటుందని చెప్పవచ్చు.
శ్వాస తీసుకోవడంలో సమస్య ఎదుర్కొన్నా, వెంటనే వెంటనే ఊపిరి పీల్చుకున్నా ఊపిరితిత్తుల వ్యాధులకు సంబంధించిన సమస్యగా గుర్తించాల్సి ఉంటుంది. ఊపిరితిత్తులలో కణితి, కార్సినోమా నుంచి ద్రవం ఏర్పడటం వలన గాలి పీల్చుకోవడంలో ఇబ్బందులు తలెత్తే అవకాశాలు అయితే ఉంటాయి. రక్త చారలతో కూడిన దగ్గు వస్తున్నట్లయితే దీర్ఘకాలిక వ్యాధి బారిన పడినట్లు గుర్తించాలి. మీ శరీరంలో ఈ సంకేతాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించి వైద్య చికిత్స చేయించుకోవాలి.