గుండెపోటు వచ్చే నెల రోజుల ముందు కనిపించే సంకేతాలివే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

ఈ మధ్య కాలంలో గుండెపోటు సమస్యతో బాధ పడేవారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. గుండెపోటు రావడానికి కొన్ని వారాల ముందు నుంచి మన శరీరం కొన్ని సంకేతాలను ఇస్తుంది. ఈ సంకేతాలను సరైన సమయంలో గుర్తించడం వల్ల ఆరోగ్య సమస్యల బారిన పడకుండా మనల్ని మనం రక్షించుకోవచ్చు. అలసట, బలహీనత సమస్యలు ఎక్కువగా వేధిస్తుంటే గుండెపోటు బారిన పడే ఛాన్స్ ఉంటుంది.

అకస్మాత్తుగా ఈ సమస్య వేధిస్తుంటే మాత్రం వెంటనే వైద్యులను సంప్రదిస్తే మంచిది. శ్వాస సంబంధిత సమస్యలు తరచూ వేధిస్తుంటే మాత్రం గుండె సమస్యలు వేధించే అవకాశాలు ఉంటాయి. ఛాతీలో భారంగా ఉన్నా వెంటనే వైద్యుల సలహాలు తీసుకోవాలి. శరీరంలోని అవయవాలు పదేపదే లాగుతూ ఉన్నా గుండెపోటుకు ఇది సంకేతంగా భావించాల్సి ఉంటుందని చెప్పవచ్చు.

గుండెలో తరచూ నొప్పిగా అనిపిస్తున్నా వెంటనే వైద్యుల సలహాలు, సూచనలు తీసుకోవాలి. చీలమండలు, పాదాలలో వాపు సమస్య వేధిస్తుంటే కూడా వైద్యులను సంప్రదిస్తే మంచిది. ఇలాంటి సంకేతాలు కనిపించిన వెంటనే గుండెకు సంబంధించిన పరీక్షలు చేయించుకోవడం ద్వారా ఏదైనా సమస్య ఉంటే గుర్తించవచ్చు.

ఎడమ చేయి తరచూ లాగుతూ ఉంటే కూడా గుండె సంబంధిత సమస్యలు వేధించే అవకాశం ఉంటుంది. ట్లాడేటప్పుడు గందరగోళానికి గురికావడం, చెప్పాలనుకొనే విషయాన్ని చెప్పలేకపోవడం, ఒకే విషయాన్ని ఎక్కువసార్లు చెప్పడం కూడా గుండె సంబంధిత సమస్యకు కారణమవుతుంది.