ఇతర కాలాలతో పోల్చి చూస్తే చలికాలంలో మనల్ని ఎక్కువ సంఖ్యలో వ్యాధులు వేధిస్తాయని చెప్పవచ్చు. జలుబు, దగ్గుతో పాటు ఈ కాలంలో ఇతర ఆరోగ్య సమస్యలు సైతం వేధించే ఛాన్స్ అయితే ఉంటుంది. ఈ సీజన్ లో ఇన్ఫెక్షన్ల బారిన పడే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటుందని చెప్పవచ్చు. కొన్ని ఆహారాలను తీసుకోవడం ద్వారా ఇన్ఫెక్షన్ల బారిన పడే అవకాశాలు అయితే తగ్గుతాయి.
చలికాలంలో నిమోనియా ముప్పు సైతం ఎక్కువగా ఉంటుంది. శీతాకాలంలో పుల్లగా ఉండే పండ్లు తింటే ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. ఈ పండ్లు తినడం ద్వారా వ్యాధులు వచ్చే అవకాశాలు తగ్గుతాయి. ప్రతిరోజూ రెండు గ్లాసుల వేడిపాలను తాగడం ద్వారా కొన్ని అనారోగ్య సమస్యల బారిన పడకుండా మనల్ని మనం రక్షించుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. చలికాలంలో గుడ్డును ఆహారంలో భాగం చేసుకుంటే మంచిది.
చలికాలంలో గుడ్డును తినడం వల్ల వేర్వేరు ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం అయితే ఉండదని చెప్పవచ్చు. ఊపిరితిత్తుల గాలి సంచుల్లో మంట పుట్టించే ఇన్‌ఫెక్షన్ ను న్యూమోనియా అని చెబుతారు. సీఓపీడీ, ఆస్తమా, మధుమేహం, రక్తపోటు వల్ల బాధ పడే వాళ్లలో న్యూమొనియా ఎక్కువగా వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. తీవ్రమైన జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఉంటే వైద్యులను సంప్రదిస్తే మంచిది.
ఆరోగ్యకరమైన జీవనశైలిని కలిగి ఉండటం వల్ల న్యుమోనియా రిస్క్‌ను సులువుగా తగ్గించుకునే అవకాశం అయితే ఉంటుంది. సిట్రస్ పండ్లు, వెల్లుల్లి, పెరుగు తీసుకోవడం ద్వారా ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. ప్రతిరోజు 30 నిమిషాల పాటు వేగవంతమైన నడక లేదా తేలికపాటి ఏరోబిక్ వ్యాయామం ద్వారా ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.