మనలో చాలామందిని ఆరోగ్యానికి సంబంధించిన ఎన్నో సమస్యలు వేధిస్తుంటాయి. ఏదైనా తీవ్రమైన ఆరోగ్య సమస్య వస్తే మూత్ర పరీక్షలు చేసి వ్యాధిని నిర్ధారించడం జరుగుతుంది. మూత్రం రంగు లేత పసుపు రంగులో ఉంటే మంచిది. అలా కాకుండా వేరే రంగులో ఉంటే మాత్రం వేర్వేరు ఆరోగ్య సమస్యలు వేధించే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. మూత్రం రంగును బట్టి ఆరోగ్యం గురించి పూర్తి విషయాలు తెలుస్తాయి.
మూత్రం రంగు మారడం డీ హైడ్రేషన్ కు సంకేతం అని చెప్పవచ్చు. కిడ్నీ సంబంధిత సమస్యలు వేధిస్తుంటే కూడా మూత్రం రంగు మారే అవకాశాలు అయితే ఉంటాయి. మూత్రంకు ఎలాంటి రంగు లేదంటే నీళ్లు ఎక్కువగా తాగుతున్నారని గుర్తించాలి. రక్తంలోని ఎలక్ట్రోలైట్స్ అసమతుల్యత వల్ల కూడా ఈ విధంగా జరిగే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. మూత్రం లేత పసుపు రంగులో ఉంటే ఆరోగ్యంగా ఉన్నాడని అర్థం.
మూత్రం ముదురు పసుపు రంగులో ఉంటే మాత్రం శరీరానికి అవసరమైన స్థాయిలో నీరు అందడం లేదని గుర్తించాలి. మూత్రం నారింజ రంగులో ఉంటే మాత్రం విటమిన్ సప్లిమెంట్లను తీసుకుంటే మంచిది. ఈ విధంగా చేయడం ద్వారా సమస్యకు చెక్ పెట్టవచ్చు. ఒక వ్యక్తి తగినంత మూత్రాన్ని ఉత్పత్తి చేయలేకపోతే నారింజ లేదా గోధుమ రంగు మూత్రం వచ్చే అవకశం ఉంటుంది.
ముదురు గోధుమ లేదా నలుపు మూత్రం వస్తుందంటే కాలేయ సంబంధిత సమస్యలు కారణమయ్యే అవకాశాలు అయితే ఉంటాయి. పింక్ లేదా ఎరుపు మూత్రం వస్తుందంటే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్, ఇతర ఆరోగ్య సమస్యలు కావచ్చు. మూత్రం రంగు మారితే వైద్యుల సలహాలు, సూచనలు తీసుకుంటే మంచిది. ఈ సమస్య విషయంలో నిర్లక్ష్యం వహించడం ఏ మాత్రం మంచిది కాదు.