తెలంగాణ నిరుద్యోగులకు అదిరిపోయే తీపికబురు.. హెల్త్ డిపార్ట్ మెంట్ నుంచి 1931 ఉద్యోగాలకు నోటిఫికేషన్!

తెలంగాణ హెల్త్ డిపార్ట్ మెంట్ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. మల్టీపర్పస్‌ హెల్త్‌ అసిస్టెంట్‌ ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ సంస్థ జాబ్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. మొదట 1520 ఉద్యోగ ఖాళీలకు జాబ్ నోటిఫికేషన్ విడుదల కాగా 1931కు ఈ ఉద్యోగ ఖాళీల సంఖ్య పెరిగింది. కేవలం మహిళలు మాత్రమే ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని తెలుస్తోంది.

మల్టీ పర్పస్ హెల్త్ వర్కర్ కోర్స్ పూర్తి చేసిన వాళ్లతో పాటు ఏ.ఎన్.ఎం కోర్సు పూర్తి చేసిన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హత కలిగి ఉంటారు. 18 సంవత్సరాల నుంచి 49 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్ లైన్ విధానంలో ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు 500 రూపాయలు కాగా ప్రాసెసింగ్ ఫీజు 200 రూపాయలుగా ఉంది.

ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్యూఎస్ , దివ్యాంగులు ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించి ఎలాంటి దరఖాస్తు ఫీజును చెల్లించాల్సిన అవసరం అయితే లేదని తెలుస్తోంది. ఇప్పటికే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ మొదలు కాగా 2023 సంవత్సరం అక్టోబర్ నెల 3వ తేదీ వరకు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. http://mhsrb.telangana.gov.in వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.

ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే వెబ్ సైట్ ద్వారా నివృత్తి చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. . హైదరాబాద్ , వరంగల్ , ఖమ్మం , నిజామాబాద్ ఈ ఉద్యోగ ఖాళీలకు పరీక్ష కేంద్రాలుగా ఉన్నాయి. http://mhsrb.telangana.gov.in అధికారిక వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన సందేహాలను నివృత్తి చేసుకునే అవకాశం అయితే ఉంటుంది.