ఐఐటీ హైదరాబాద్ లో నాన్ టీచింగ్ ఉద్యోగ ఖాళీలు.. మంచి వేతనంతో?

ఐఐటీ హైదరాబాద్ నిరుద్యోగులకు తీపికబురు చెప్పింది. నాన్ టీచింగ్ పోస్టుల భర్తీ కోసం ఈ సంస్థ భారీ సంఖ్యలో ఉద్యోగ ఖాళీల భర్తీ దిశగా అడుగులు వేస్తుండటం గమనార్హం. డిసెంబర్ 10వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది. ఆన్ లైన్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా వేర్వేరు ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారు.

సూపరిండెంట్ ఇంజినీర్ 1, పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ 1, టెక్నికల్ సూపరిండెంట్ 1, జూనియర్ సైకలాజికల్ కౌన్సిలర్, ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్, పిజియో థెరపిస్ట్, స్టాఫ్ నర్స్, జూనియర్ టెక్నికల్ సూపరిండెంట్, జూనియర్ ఇంజనీర్, అకౌంటెంట్, జూనియర్ టెక్నీషియన్ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారు. మొత్తం 31 ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనుండటం గమనార్హం.

పదో తరగతి నుంచి పీజీ వరకు అర్హత, అనుభవం ఆధారంగా ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుంది. వేర్వేరు ఉద్యోగ ఖాళీలకు వేర్వేరు విద్యార్హతలు ఉన్నాయి. సాధారణంగా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు రుసుము 500 రూపాయలుగా ఉండగా ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఎలాంటి దరఖాస్తు ఫీజు లేదు. రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, ట్రేడ్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరుగుతోంది.

డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా ఐఐటీ హైదరాబాద్ నాన్ టీచింగ్ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తులను కోరుతోంది. డిసెంబర్ 10వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది. నోటిఫికేషన్ ద్వారా పూర్తి వివరాలను తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది.