మన దేశంలో ప్రజలు తినే వంటకాలలో కరివేపాకును ఎక్కువగా ఉపయోగిస్తారని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వంటల్లో ఎక్కువగా ఉపయోగించే కరివేపాకు వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. కరివేపాకు రసం తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలకు సులువుగా చెక్ పెట్టడం సాధ్యమవుతుంది. వంటకాలకు అదనపు రుచి ఎలా చేయడంలో కరివేపాకు ఎంతో తోడ్పడుతుంది.
కరివేపాకు ఆహారం రుచి మరియు వాసన పెంచడంలో ఎంతగానో సహాయపడుతుంది. శరీరానికి అవసరమైన విటమిన్ ఏ మరియు సీ ని సరఫరా చేయడంలో కరివేపాకు ఆకులు సహాయపడతాయి. కరివేపాకులో ఉన్న ఔషధ లక్షణాలు రక్తహీనత సమస్యకు చెక్ పెట్టడంలో తోడ్పడతాయి. కరివేపాకు మన జీర్ణక్రియను మెరుగుపరచడంతో పాటు బరువు నియంత్రణలో సహాయపడుతుంది.
కరివేపాకులో ఔషధ గుణాలు ఉన్నాయని వైద్యులు సైతం చెబుతున్నారు. కరివేపాకుల్లో ఉండే ఫైబర్ ఇన్సులిన్‌ను ప్రభావితం చేసి షుగర్ లెవెల్స్ ను సులువుగా తగ్గిస్తుంది. మలబద్ధకం సమస్యను కూడా తొలగించడంలో కరివేపాకు తోడ్పడుతుంది. మెదడుతో సహా మీ నాడీ వ్యవస్థ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి అవసరమైన పదార్థాలు కరివేపాకులో ఉంటాయని చెప్పవచ్చు.
యాంటీబయోటిక్ మరియు యాంటీ ఫంగల్ లక్షణాలను కలిగి ఉండే కరివేపాకు వల్ల లాభాలే తప్ప నష్టాలు లేవు. కరివేపాకు ఆకులను నీటితో ఉడకబెట్టడం మరియు దానితో స్నానం చేయడం వల్ల ఫంగల్ ఇన్ఫెక్షన్లకు చెక్ పెట్టవచ్చు. కరివేపాకు వల్ల లాభాలే తప్ప నష్టాలు లేవు. కరివేపాకును ఉపయోగించడం వల్ల ఎలాంటి నష్టాలు ఉండవు.