తెలంగాణ సర్కార్ అదిరిపొయే గుడ్ న్యూస్.. రూ.లక్ష పొందాలంటే చేయాల్సిన పని ఇదే!

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని యువతకు అదిరిపోయే తీపికబురు అందించింది. ఒక కొత్త స్కీమ్ ద్వారా ఒక్కొక్కరికి లక్ష రూపాయలు అందించడానికి సిద్ధమైంది. ఒక కొత్త స్కీమ్ ద్వారా యువతకు లక్ష రూపాయలు అందించే దిశగా తెలంగాణ సర్కార్ అడుగులు పడుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి తాజాగా ఈ పథకాన్ని ప్రకటించడం కొసమెరుపు.

యూపీఎస్సీ సివిల్స్ ప్రిలిమ్స్ పాసైన అభ్యర్థులకు ఆర్థిక సాయం అందించాలనే ఆలోచనతో ఈ స్కీమ్ దిశగా తెలంగాణ సర్కార్ అడుగులు వేస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే ఈ స్కీమ్ అమలు కానుంది. సివిల్స్ ప్రిలిమ్స్ పాసైన పేద అభ్యర్థులకు ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం అందే దిశగా అడుగులు పడుతున్నాయి. రాజీవ్ గాంధీ సివిల్స్ అభయ హస్తం పేరుతో ఈ స్కీమ్ అమలు కానుంది.

పేద విద్యార్థులకు ఈ స్కీమ్ వల్ల భారీ స్థాయిలో ప్రయోజనం చేకూరనుందని చెప్పవచ్చు. మెయిన్స్ పరీక్షలను రాసే అభ్యర్థులకు ఉచితంగా కోచింగ్ ఇవ్వాలని రేవంత్ రెడ్డి సర్కార్ తీసుకున్న నిర్ణయంపై ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. ఉచిత కోచింగ్‌తో పాటు ప్రతి నెలా 5,000 రూపాయల చొప్పున మొత్తాన్ని స్టైపెండ్‌గా పొందే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.

హైదరాబాద్‌లో సైదాబాద్ లక్ష్మీనగర్ కాలనీ రోడ్ నంబర్ 8తో పాటు ఖమ్మంలోని బీసీ స్టడీ సర్కిల్‌లల్లో ఈ ఉచిత కోచింగ్ అందనుందని తెలుస్తోంది. 75 రోజుల పాటు ఇందుకు సంబంధించిన ట్రైనింగ్ ఇవ్వనున్నారని భోగట్టా. కోచింగ్ సమయంలో నెలకు 5,000 రూపాయల చొప్పున స్టైఫండ్ పొందవచ్చు. సివిల్స్ అభ్యర్థులకు ప్రయోజనం కలిగేలా తెలంగాణ సర్కార్ తీసుకున్న నిర్ణయంపై ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.