Revanth Reddy: ఇళ్లకు సంబంధించిన సర్వేను నిర్వహించే ప్రత్యేక మొబైల్ యాప్‌ను సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. రానున్న రోజుల్లో ఇందిరమ్మ ఇళ్ల స్కీంలో లబ్ధిదారుల ఎంపికలో ఈ యాప్ కీలక పాత్ర పోషిస్తుందని ఆయన తెలిపారు.కేంద్ర ప్రభుత్వ గృహ నిర్మాణ పథకాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ యాప్ ను రూపొందించిందని రేవంత్ రెడ్డి తెలిపారు.
ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుంచి ఇందిరమ్మ ఇంటికి అర్హుల ఎంపిక ప్రక్రియ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది.ప్రజాపాలన కార్యక్రమంలో వచ్చిన దరఖాస్తులలోని సమాచారం ఆధారంగా ప్రభుత్వ సిబ్బంది ఇంటింటికి వెళ్లి వివరాలను నమోదు చేయడమే కాకుండా లబ్ధిదారులకు అక్కడే ఈ యాప్ ద్వారా నమోదు చేస్తారని తెలిపారు. ఈ
సర్వేలో భాగంగా.. ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుదారుడి పేరు, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఆర్థిక పరిస్థితి, ఇళ్లు నిర్మించనున్న స్థలం, ఇతర వివరాలకు సంబంధించిన దాదాపు 35 ప్రశ్నలను అడిగి వివరాలను యాప్‌లో రిజిస్ట్రేషన్ చేస్తారు వాటి ఆధారంగా లబ్ధిదారులను ఎంపిక చేస్తారని తెలిపారు.
ఇందిరమ్మ కమిటీలు గ్రామసభలను ఏర్పాటు చేసి లబ్ధిదారులకు విడతల వారీగా ఎంపిక ప్రక్రియ చేపట్టనున్నట్లు వెల్లడించారు అయితే ఈ ఇందిరమ్మ ఇళ్లలో ఎక్కువగా దివ్యాంగులు వృద్ధులు ఒంటరి మహిళలు వితంతువులకు అధిక ప్రాధాన్యత ఇచ్చినట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. దేశంలో గుడి లేని ఊరు ఉందేమో కానీ ఇందిరమ్మ కాలిని లేని ఊరు లేదని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి తెలిపారు.
రోటీ, కపడా, మకాన్ అనేది ఇందిరమ్మ నినాదం. ప్రజలు ఇల్లు, వ్యవసాయ భూమిని ఆత్మగౌరవంగా భావిస్తారు. అందుకే ఇందిరాగాంధీ గత కొన్ని దశాబ్దాల క్రితమే భూ పంపిణీ పథకాన్ని ప్రవేశపెట్టింది అంటూ ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి ఇందిరమ్మ ఇల్లు మొబైల్ యాప్ ఓపెనింగ్ కార్యక్రమంలో భాగంగా చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.