ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని లక్షల సంఖ్యలో అభ్యర్థులు మెగా డీఎస్సీ కోసం ప్రిపేర్ అవుతున్న సంగతి తెలిసిందే. మెగా డీఎస్సీ ఫ్రీ కోచింగ్ కోరుకునే వాళ్ల కోసం సాంఘిక సంక్షేమ శాఖ, గిరిజన సంక్షేమ శాఖ దరఖాస్తులను ఆహ్వానిస్తూ ఉండటం గమనార్హం. ఈ శిక్షణకు హాజరయ్యే అభ్యర్థులకు బోధన, ఉచిత సౌకర్యంతో పాటు వసతి సౌకర్యం లభించనుంది. మూడు నెలల పాటు ఈ తరగతులను నిర్వహించనున్నారు.
అనుభవజ్ఞులైన బోధనా సిబ్బందితో ఈ శిక్షణను అందించనున్నారు. స్కూల్ అసిస్టెంట్, ఎస్జీటీ పరీక్షలకు సంబంధించి కోచింగ్ ఉంటుందని సమాచారం అందుతోంది. జ్ఞానభూమి వెబ్ పోర్టల్ ద్వారా కోచింగ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత ఉన్న ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు ఈ కోచింగ్ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఆన్ లైన్ ద్వారా ఈ కోచింగ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
అక్టోబర్ నెల 21వ తేదీ దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉండటం గమనార్హం. ఈ కోచింగ్ కోసం మొత్తం 5050 మంది అభ్యర్థులను ఎంపిక చేయడం జరుగుతుంది. కోచింగ్ కు సంబంధించి ఎస్సీలకు 3050 సీట్లు కేటాయించగా ఎస్టీలకు 2000 సీట్లను కేటాయించడం జరిగింది. ఈ కోచింగ్ కు ఎంపికైన వాళ్లకు ఫ్రీగా బోధన, భోజనం, వసతి సౌకర్యం లభిస్తాయి.
ఇంటర్, డీఈడీ అర్హత ఉన్నవాళ్లు ఎస్జీటీ కోచింగ్ కు, డిగ్రీ, బీఈడీ, టెట్ స్కూల్ అసిస్టెంట్ కోచింగ్ కు ఎంపికయ్యారు. శిక్షణకు మరికొన్ని గంటల సమయం మాత్రమే ఉన్న నేపథ్యంలో అర్హత ఉన్నవాళ్లు వెంటనే దరఖాస్తు చేసుకుంటే మంచిదని చెప్పవచ్చు. ఏకంగా హాస్టల్ సౌకర్యంతో శిక్షణ ఇస్తుండటం నిరుద్యోగులకు మేలు చేస్తుంది.