చిలకడదుంప తినడం వల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాలివే.. వీటి వల్ల ఇన్ని లాభాలా?

మనలో చాలామంది ఎంతో ఇష్టంగా తినే వాటిలో చిలకడదుంప ఒకటని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చిలకడదుంపను వంటల్లో కంటే ఉడికించి లేదా కాల్చి స్నాక్స్ గా తినడానికే చాలా మంది ఇష్టపడతారని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కొంతమంది ఈ దుంపలతో వెరైటీ వంటకాలను చేయడానికి ప్రాధాన్యత ఇస్తారు. చర్మ సంరక్షణకు చిలకడదుంపలు చాలా మంచివని పలు సర్వేలలో వెల్లడి కావడం గమనార్హం.

చిలకడదుంపలలో విటమిన్-సి, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయని చెప్పవచ్చు. కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచడంలో ఇవి కీలక పాత్ర పోషించే ఛాన్స్ అయితే ఉంటుంది. కొల్లాజెన్ అనేది ఒక ప్రోటీన్ కాగా చర్మం మృదువుగా, యవ్వనంగా ఉండటంలో ఈ ప్రోటీన్ సహాయపడుతుందని చెప్పవచ్చు. వయసుతో పాటు వచ్చే ముడతలు రాకుండా నివారించడంలో ఇది సహాయపడుతుంది.

చిలకడదుంపలలో బీటా-కెరోటిన్ ఉంటుందనే సంగతి తెలిసిందే. యాంటీఆక్సిడెంట్లను కలిగి ఉండే చిలకడదుంపలు చర్మానికి పునరుజ్జీవనాన్ని ఇవ్వడంలో సహాయపడతాయని చెప్పవచ్చు. చిలకడ దుంపలలో ఉండే బీటా కెరోటిన్ హానికరమైన కిరణాల నుండి చర్మాన్ని రక్షించడంలో తోడ్పడుతుందని చెప్పవచ్చు. చర్మానికి తేమను అందించి చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచడంలో చిలకడదుంపలు సహాయపడతాయి.

చిలకడదుంపలను స్నాక్స్ సమయంలో తీసుకుంటే ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. బయటి ఆహారాలకు అడిక్ట్ అయినవారు వాటికి బదులుగా చిలకడదుంప తీసుకోవడం ద్వారా హెల్త్ బెనిఫిట్స్ పొందవచ్చు. రొటీన్ గా చిలకడదుంపలను తినలేని వారు శాండ్విచ్ లలోనూ, సలాడ్ లలోనూ వీటిని తీసుకుంటే హెల్త్ బెనిఫిట్స్ కలుగుతాయని చెప్పవచ్చు.