ఈ లక్షణాలు కనిపిస్తే మాత్రం మీ కిడ్నీలలో రాళ్లు ఉన్నట్టే.. ప్రాణాలకు ప్రమాదమంటూ?

ఈ మధ్య కాలంలో కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధ పడేవాళ్ల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఈ సమస్య చిన్న సమస్యలా అనిపించినా కిడ్నీలో రాళ్ల వల్ల దేశంలో లక్షల సంఖ్యలో ప్రజలు బాధ పడుతున్నారు. కిడ్నీలో రాళ్ల వల్ల ఎక్కువసార్లు మూత్రం రావడం, అధిక మూత్ర విసర్జన లాంటి సమస్యలు ఎక్కువగా వేధిస్తున్నాయి. ఇప్పటికే ఈ సమస్యతో బాధ పడుతున్న వాళ్లలో భవిష్యత్తులో సమస్య తీవ్రమయ్యే అవకాశం ఉంటుంది.

కిడ్నీలో రాళ్ల సమస్యతో బాధ పడేవాళ్లు పొత్తికడుపులో తీవ్రమైన నొప్పితో బాధ పడటంతో పాటు మూత్రానాళాలకు సంబంధించిన సమస్యలను ఎదుర్కొంటారు. మూత్రనాళం ద్వారా రాయి కదులుతున్న సమయంలో నొప్పి మరింత తీవ్రమవుతుంది. మధుమేహం లేకుండా ఎక్కువసార్లు యూరిన్ ఇన్ఫెక్షన్ వేధిస్తుంటే కూడా కిడ్నీలో రాళ్ల సమస్య అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుందని చెప్పవచ్చు.

మూత్రంలో మంట సమస్యతో తరచూ బాధ పడుతున్నా కిడ్నీలో రాళ్లకు సంబంధించిన పరీక్షను చేయించుకుంటే మంచిదని చెప్పవచ్చు. మూత్రం నుంచి దుర్వాసన వస్తున్నా తరచుగా వికారం వాంతులు సమస్యలు వేధిస్తున్నా పదే పదే కారణం లేకుండా జ్వరం, జలుబు సమస్యలు వేధిస్తున్నా కిడ్నీలో రాళ్ల సమస్య కారణం అయ్యే అవకాశాలు అయితే ఉంటాయి.

విపరీతంగా చెమటలు పట్టడం కూడా ఈ సమస్యకు సంకేతం అని చెప్పవచ్చు. ఆహారంలో మార్పులు చేసుకుంటూ హైడ్రేటెడ్ గా ఉంటూ ఆరోగ్యకరమైన బరువును నిర్వహిస్తూ కాల్షియం ఎక్కువగా తీసుకోవడం, జంతు ప్రోటీన్లను పరిమితంగా తీసుకోవడం ద్వారా హెల్త్ బెనిఫిట్స్ ను పొందవచ్చు.