దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిరుద్యోగులకు తీపికబురు అందిస్తుండటం గమనార్హం. బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వాళ్లు వెంటనే ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకుంటే మంచిది. మొత్తం 194 ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు. ఎఫ్.ఎల్.సి డైరెక్టర్, ఎఫ్.ఎల్.సి కౌన్సిలర్ ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారని తెలుస్తోంది.
జూలై 6, 2023 ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉండనుంది. కౌన్సిలర్ ఉద్యోగ ఖాళీలు 182 ఉండగా ఇతర ఉద్యోగ ఖాళీలు 12 ఉన్నాయి. 60 నుంచి 63 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. రిజర్వేషన్ల ఆధరంగా వయో పరిమితిలో సడలింపులు ఉంటాయని తెలుస్తోంది.
షార్ట్‌లిస్టింగ్, మెరిట్ లిస్ట్ అండ్ ఇంటర్వ్యూ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లు దేశంలో ఎక్కడైనా పని చేయాల్సి ఉంటుందని సమాచారం అందుతోంది. అర్హత, ఆసక్తి ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం వెంటనే దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. ఎస్బీఐ వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు మేలు చేస్తోంది.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగ ఖాళీలపై ఆసక్తి ఉన్నవాళ్లు వెంటనే ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకుంటే మంచిది. ఎస్బీఐ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా మేలు చేస్తోంది.