పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో భారీ సంఖ్యలో ఉద్యోగ ఖాళీలు.. మంచి వేతనంతో?

పంజాబ్ నేషనల్ బ్యాంక్ నిరుద్యోగులకు తీపికబురు చెప్పింది. స్పెషలిస్ట్ ఆఫీసర్ ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ సంస్థ అభ్యర్థుల నుంచి దరఖాస్తులను కోరుతోంది. మార్చి 24వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉండనుంది. ఆన్ లైన్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం సులువుగానే దరఖాస్తు చేసుకోవచ్చు. వేర్వేరు ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వార భర్తీ చేయనున్నారు.

క్రెడిట్ ఆఫీసర్, ఇండస్ట్రీ ఆఫీసర్, మేనేజర్ ఐటీ, సీనియర్ మేనేజర్ ఐటీ, మేనేజర్ డేటా సైంటిస్ట్, సీనియర్ మేనేజర్ డేటా సైంటిస్ట్, మేనేజర్ సైబర్ సెక్యూరిటీ, సీనియర్ మేనేజర్ సైబర్ సెక్యూరిటీ ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. మొత్తం 350 ఉద్యోగ ఖాళీలు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ కానున్నాయని సమాచారం అందుతోంది.

బీటెక్, బీఈ, సీఏ ఐసీడబ్ల్యూ, ఎంబీఏ పాసైన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. 21 నుంచి 38 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హులు. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు 48480 రూపాయల నుంచి లక్షా 5 వేల 280 రూపాయల వరకు వేతనం లభించే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఆన్ లైన్ ద్వారా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు 1000 రూపాయలు కాగా మిగతా అభ్యర్థులకు మాత్రం దరఖాస్తు ఫీజు 500 రూపాయలుగా ఉండనుంది. రాత పరీక్ష ఆధారంగా ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. అర్హత ఉన్నవాళ్లు వెంటనే ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకుంటే మంచిది.