స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నిరుద్యోగులకు అదిరిపోయే తీపికబురు అందించింది. భారీ సంఖ్యలో కానిస్టేబుల్ జీడీ ఉద్యోగ ఖాళీల భర్తీ కొరకు జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. ఆన్ లైన్ విధానంలో ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకునే ఛాన్స్ ఉంటుంది. అక్టోబర్ 14వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ కాగా అక్టోబర్ 15వ తేదీ దరఖాస్తు చేసుకోవడానికి లాస్ట్ డేట్ గా ఉంది.
కంప్యూటర్ ఆధారిత రాతపరీక్ష, ఫిజికల్ టెస్ట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరగనుంది. వచ్చే ఏడాది మొదటి రెండు నెలల్లో ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన రాతపరీక్ష జరుగుతుంది. మొత్తం 39,481 కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) ఉద్యోగ ఖాళీలు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ కానున్నాయని సమాచారం అందుతోంది. వేర్వేరు విభాగాల్లో ఉద్యోగ ఖాళీలు ఉండగా అర్హతల ఆధారంగా దరఖాస్తు చేసుకోవాలి.
పదో తరగతి పాస్ కావడంతో పాటు కనీసం 170 సెంటిమీటర్ల ఎత్తు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాలకు అర్హులు. 18 నుంచి 23 ఏళ్ల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్ల వయో సడలింపు ఉంటుంది. కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష ద్వారా ఈ ఉద్యోగాలకు ఎంపిక ప్రక్రియ జరుగుతుంది.
పదో తరగతి స్థాయి ప్రశ్నల ద్వారా రాతపరీక్షను నిర్వహిస్తారు. మొత్తం 80 మార్కులకు ఈ ఉద్యోగాలకు సంబంధించిన పరీక్షను నిర్వహిస్తారని సమాచారం అందుతోంది. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది.