మనలో చాలామంది ఏదో ఒక సందర్భంలో లక్ష్మణ ఫలం గురించి వినే ఉంటారు. విటమిన్ సి పుష్కలంగా ఉండే లక్ష్మణ ఫలం మనల్ని నిత్యం శక్తివంతంగా ఉంచడంలో ఎంతగానో సహాయపడుతుంది. యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే లక్ష్మణ ఫలం తీసుకోవడం ద్వారా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. లక్ష్మణ ఫలంలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఎన్నో వ్యాధులకు చెక్ పెడతాయి.
క్యాన్సర్ వచ్చే ప్రమాదంను తగ్గించడంలో లక్ష్మణ ఫలం ఎంతగానో తోడ్పడుతుంది. లక్ష్మణ ఫలం రసం రొమ్ము క్యాన్సర్ కణితులను సైతం సులభంగా తగ్గిస్తుంది. లక్ష్మణ ఫలంలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఈ పండు తినడం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు దూరం కావడంతో పాటు మలబద్ధకం సమస్య కూడా దూరమయ్యే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. బ్లడ్ షుగర్ నియంత్రణలో ఈ పండ్లు తోడ్పడతాయి.
యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉన్న ఈ పండ్లు బ్యాక్టీరియాను చంపడంలో ఎంతగానో సహాయపడతాయి. లక్ష్మణ ఫలం రసం వల్ల కలరా సమస్యను కూడా దూరం చేసుకోవచ్చు. యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉన్న లక్ష్మణ ఫలం మోకాళ్ల వాపును తగ్గించడంలో తోడ్పడుతుంది. బ్రెజిల్, అమెరికా వంటి అనేక దేశాల్లో ఎక్కువగా పండే ఈ పండు జనవరి నుంచి మే మాసాలలో ఎక్కువగా లభిస్తుంది.
ఒక్క లక్ష్మణ ఫలం ధర 800 రూపాయల నుంచి 2000 రూపాయల రేంజ్ లో ఉంటుందంటే ఈ పండ్లు ఎంత ఖరీదైన పండ్లు అనే ప్రశ్నకు సంబంధించి సమాధానం దొరుకుతుంది. తేమ, వర్షపాతం ఎక్కువ ఉండే దట్టమైన అడవుల్లో మాత్రమే ఈ పండ్లకు సంబంధించిన చెట్లు పెరుగుతాయని చెప్పవచ్చు.