రుచిగా ఉన్నాయని బలపాలు ఇష్టంగా తింటున్నారా.. ప్రాణాలకే హాని చేసే ఈ సమస్యలు వస్తాయట!

ఈతరం పిల్లల్లో చాలామంది బలపాలు తినే అలవాటును కలిగి ఉంటారు. బలపాలు తినడం ఆరోగ్యానికి మంచిది కాదని తెలిసినా కొంతమంది ఆ అలవాటును మాత్రం మానలేకుండా ఉంటారు. అయితే బలపాలు ఎక్కువగా తీసుకుంటే ప్రాణాలకే ప్రమాదమని వైద్య నిపుణులు చెబుతున్నారు. బలపాలు తినడం వల్ల ఒక్కటంటే ఒక్క లాభం కూడా ఉండదని వాళ్లు వెల్లడిస్తూ ఉండటం గమనార్హం.

బలపాలు రుచిగా ఉండటం వల్లే చాలామంది వీటిని తినడానికి ఆసక్తి చూపిస్తారు. కొంతమంది పీకా అనే డిజార్డర్ వల్ల బలపాలు తింటారని తెలుస్తోంది. ఎవరైతే ఈ ఆరోగ్య సమస్యతో బాధ పడుతూ ఉంటారో వాళ్లు తినకూడని వస్తువులను తినడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఐరన్, జింక్ లోపం సమస్యలతో బాధ పడేవాళ్లు ఎక్కువగా బలపాలు తినడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటారని తెలుస్తోంది.

బలపాలు తింటే హెల్త్ బెనిఫిట్స్ కలుగుతాయని భావించి కొంతమంది వీటిని తినడానికి ఆసక్తి చూపిస్తారని తెలుస్తోంది. బలపాలు తినడం వల్ల రక్తహీనత సమస్యలు, యూరిన్ సమస్యలు, మౌత్ అల్సర్, స్టమక్ అల్సర్, కిడ్నీ స్టోన్స్ సమస్యలతో పాటు క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అందువల్ల బలపాలు తినేవాళ్లు ఈ విషయాలను తప్పనిసరిగా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది.

బలపాలు తరచుగా తినేవాళ్లు ఇప్పటికైనా ఈ అలవాటును మార్చుకుంటే కొత్త ఆరోగ్య సమస్యల బారిన పడకుండా మనల్ని మనం రక్షించుకునే అవకాశం అయితే ఉంటుంది. బలపాలు తింటే తాత్కాలికంగా అవి రుచిగా అనిపించినా దీర్ఘకాలంలో మాత్రం ఎన్నో ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. బలపాలను తింటే కోరి కొత్త ఆరోగ్య సమస్యలను తెచ్చుకున్న వాళ్లు అవుతారని చెప్పవచ్చు.