దురద, దద్దుర్లు సమస్యలతో బాధ పడుతున్నారా.. సులువుగా చెక్ పెట్టే అద్భుతమైన చిట్కాలివే!

చర్మ సంబంధిత సమస్యలు చిన్న సమస్యలలా అనిపించినా ఆ సమస్యల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఆరోగ్య సమస్యలు తీవ్రమయ్యే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. తరచూ తడిచిన దుస్తులను ధరించడం వల్ల ఎక్కువగా దురద, దద్దుర్లు లాంటి సమస్యలు వేధించే అవకాశాలు అయితే ఉంటాయి. గజ్జి, తామర మొదలైన చర్మ సమస్యల వల్ల దీర్ఘకాలంలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది.

వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు కొన్ని చిట్కాలను పాటించడం ద్వారా దురద, దద్దుర్లు సమస్యలు సులువుగా దూరమయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. దురద, దద్దుర్లు సమస్యలు వేధిస్తుంటే చర్మంపై చందనపు పేస్ట్ ను రాస్తే మంచిది. చందనం పేస్ట్ దురదల నుంచి ఉపశమనం కలిగించడంతో పాటు చర్మం రంగును కూడా మెరుగుపరిచే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.

చర్మ సంబంధిత సమస్యలలో వేపను ఉపయోగించడం ద్వారా ఎన్నో ఆరోగ్య సమస్యలు దూరమవుతాయి. వేపలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు దురద నుండి ఉపశమనం కలిగించి ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుస్తాయి. వర్షాకలంలో ఉండే తేమ వాతావరణం వల్ల చర్మంపై దురద కలిగితే నిమ్మకాయ -బేకింగ్ సోడా అప్లై చేయడం ద్వారా కూడా ఈ సమస్యను దూరం చేసుకోవచ్చు.

కొబ్బరినూనె చర్మానికి తేమను అందించడంతో పాటు ఇన్ఫెక్షన్లకు చెక్ పెట్టడంలో ఉపయోగపడుతుంది. దురదలు, దద్దుర్లు ఉన్నచోట కొబ్బరినూనె రాస్తే ఆ సమస్య వెంటనే దూరమయ్యే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. వర్షాకాలంలో ఎక్కువగా పొడిదుస్తులను ధరిస్తే ఆరోగ్యానికి మంచిది.