వరుస తుమ్ముల వల్ల ఇబ్బందులు పడుతున్నారా.. ఈ చిట్కాలతో సమస్యలకు చెక్!

కాలంతో సంబంధం లేకుండా అందరినీ తుమ్ముల సమస్య ఇబ్బంది పెడుతుందనే సంగతి తెలిసిందే ఈ సమస్య చిన్న సమస్యలా అనిపించినా వరుసగా వచ్చే తుమ్ములతో కొందరు తీవ్రంగా ఇబ్బంది పడటం జరుగుతుంది. చలికాలంలో కొందరికి ఒకేసారి అనేక తుమ్ములు రావడం వల్ల రోజువారీ పనిలో సమస్యలు వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. వరుసగా వచ్చే తుమ్ముల వల్ల ఇతరులు కూడా ఇబ్బందిపడాల్సి ఉంటుందని తెలుస్తోంది.

అయితే కొన్ని చిట్కాలను పాటించడం ద్వారా ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చు. తరచుగా తుమ్ములు వస్తుంటే చలికాలంలో చల్లటి నీళ్లు తాగడం మానేస్తే మంచిది. అల్లం టీ లేదా సూప్ వంటివి తాగడం ద్వారా ముక్కు సంబంధిత సమస్యలు దూరమవుతాయి. వేడినీళ్లు తాగడం వల్ల శరీరం కాస్త వేడెక్కి ఉదరానికి సంబంధించిన సమస్యలు కూడా మీకు దూరమయ్యే అవకాశాలు అయితే ఉంటాయి.

అల్లం మరియు తేనె మిశ్రమం జలుబును నయం చేయడంతో పాటు తుమ్ముల సమస్యకు సైతం పూర్తిస్థాయిలో చెక్ పెడుతుంది. అల్లం ముక్కను మెత్తగా నూరి అందులోంచి రసాన్ని తీసి అందులో కొంచెం తేనె కలుపుకుని రోజుకు రెండుసార్లు తీసుకోవడం ద్వారా తుమ్ముల సమస్యకు సంబంధించి పరిష్కారం లభిస్తుందని చెప్పవచ్చు. ద్రాక్షలో విటమిన్ సి పుష్కలంగా ఉండగా ద్రాక్షను తీసుకుంటే, ఇది రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటు తుమ్ములను ఆపుతుంది.

వేడి నీటి ఆవిరిని తీసుకోవడం ద్వారా కూడా తుమ్ములు రావడాన్ని చెక్ పెట్టవచ్చు. తుమ్ముల సమస్య మిమ్మల్ని ఎక్కువగా బాధపెడుతుంటే, ఖచ్చితంగా రోజుకు ఒకసారి ఆవిరి పట్టాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. అలర్జీ సమస్య ఉన్నవారు నల్లమిరియాలు తీసుకుంటే మంచిది. తులసి, నల్లమిరియాలతో చేసిన టీని తయారు చేసుకుని తాగితే మంచి ఫలితాలు పొందవచ్చు.