భార్యాభర్తల మధ్య సఖ్యత లేకపోతే ఆ ఇల్లు నరకంతో సమానమని పెద్దవాళ్ళు చెబుతుంటారు. రోజురోజుకు భార్య భర్తలు విడిపోయే కేసులు ఎక్కువవుతున్నాయి దీనికి కారణం ఒకరిపై ఒకరికి నమ్మకం లేకపోవడం, అక్రమ సంబంధాలు, ఆర్థిక కారణాలు, సెక్స్ పై ఆసక్తి లోపించడం, అనారోగ్య సమస్యలు వంటి ఎన్నో కారణాలతో భార్యాభర్తల మధ్య గొడవలు ప్రారంభమై చివరకు విడిపోయే అవకాశాలు పెరుగుతున్నాయి. ఇలాంటి ఒడిదుడుకుల ప్రయాణంలో మనం దాంపత్య జీవితంలో సంతోషంగా ఉన్నామో లేదో కూడా చాలా మందికి తెలియదట. మీరు మీ లైఫ్ పార్టనర్ తో సంతోషంగా ఉన్నారో లేదో తెలుసుకోవడానికి ఇప్పుడు చెప్పబోయే సంకేతాలు ఉపయోగపడతాయి.
భార్యాభర్తలు ఇద్దరూ ఒకే ఇంట్లో ఉంటున్నప్పటికీ ఒకరితో మరొకరు కనీసం మాట్లాడుకోవడం, బాగోగులు తెలుసుకోకపోవడం,ఎవరి పని వారు అన్నట్లుగా ఉంటున్నానట్లు సంకేతం కనిపిస్తే మీ బంధం సరిగా లేదనే అర్థం.విడిపోవాలి అనే భావనలు తరచూ కలుగుతున్నాయి అంటే మీ దాంపత్య జీవితం సరిగా లేదనే అర్థం.దాంపత్య జీవితం సంతోషంగా ఉండాలని అందరూ కోరుకుంటారు అలాకాకుండా
మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకున్నా, పెట్టుకోవాలనే ఆలోచన వచ్చినా మీరు మీ పార్ట్ నర్ తో సంతోషంగా లేరని అర్థం. త్వరలోనే మీ బంధానికి శుభం కార్డు పడే సూచనలు ఎక్కువగా కనిపిస్తుంటాయి.
మిమ్మల్ని మీ లైఫ్ పార్టనర్ దగ్గర చేసేది ప్రేమ, ఆప్యాయత, అనురాగాలతో పాటు శారీరక సంబంధమే మీ ఇద్దరి మధ్య ఇలాంటి ఫీలింగ్స్ లేకుంటే శృంగారంలో పాల్గొనాలనే కోరిక కూడా కలగదు. ఒకవేళ మీకు కలయికలో పాల్గొనాలనే కోరిక కలిగినా మీ పార్ట్ నర్ తిరస్కరించడం లాంటివి చేస్తున్నారు అంటే కూడా మీరు సంతోషంగా లేరనే అర్థం. తక్షణం విడిపోవాలని భావనలు తరచూ కలుగుతున్నాయి అంటే మీ దాంపత్య జీవనంలో సుఖంగా మీరు లేరని అర్థం.
భార్యాభర్తల మధ్య చిన్న చిన్న తగాదాలు సర్వసాధారణం అలా కాకుండా చీటికిమాటికి చిరాకు పడుతూ హేళన చేస్తుంటే మీ బంధం సరిగా లేదు ఇక విడిపోవడమే మంచిది అన్న భావన మీలో కలుగుతుందంటే ఇద్దరి మధ్య అన్యోన్యత లోపించిందని అర్థం. ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకోగలగాలి.ఎలాంటి అవాంతరాలు వచ్చినా విడిపోరు అనే నమ్మకం ఉండాలి. అలా కాకుండా ఎవరో చెప్పిన మాటలు విని చిన్నపాటి తగాదాలతోనే మీ బంధం తెగిపోయే పరిస్థితి వచ్చింది అంటే మీ ఇద్దరి మధ్య సఖ్యత లేదని అర్థం చేసుకోవాలి.