పవన్ తన తండ్రిని గుర్తుచేసుకుంటూ ఆ సినిమా చేస్తున్నాడట

Pawan signs remake movie because of his father
Pawan signs remake movie because of his father
 
పవన్ కళ్యాణ్ చేస్తున్న కొత్త సినిమాల్లో ‘అయ్యప్పనుమ్ కొషియుమ్’ తెలుగు రీమేక్ ఒకటి. నిజానికి ‘వకీల్ సాబ్’ తర్వాత పవన్ ‘హరి హర వీరమల్లు’ మాత్రమే చేయాల్సి ఉంది.  కానీ అనూహ్యంగా ఈ రీమేక్ సినిమా మధ్యలో దూరింది.  నిజానికి పవన్ వద్ద ఒక సినిమాకు గ్రీన్ సిగ్నల్ తీసుకోవడం కష్టమైన పనే.  కానీ ఈ రీమేక్ చిత్రానికి మాత్రం పవన్ చాలా త్వరగా ఒప్పుకోవడం జరిగింది.  త్రివిక్రమ్ మధ్యలో చేరి వ్యవహారం మొత్తం నడిపారు. అయితే పవన్ ఇంత త్వరగా ఈ సినిమాకు సైన్ చేయడానికి వేరే కారణాలూ ఉన్నాయి.  అది కూడా పవన్ పర్సనల్ కారణాలే కావడం విశేషం. 
 
ఒరిజినల్ కథలో కథానాయకుడు ఎక్సయిజ్ విభాగంలో పనిచేసే ఎస్ఐ.  ఇదే పవన్ ను సినిమాకు సైన్ చేసేలా చేశాయి.  పవన్ కళ్యాణ్ తండ్రి కూడ ఆబ్కారీ శాఖలో పనిచేసిన పోలీస్ అధికారి.  కానిస్టేబుల్ లెవల్ నుండి ఆబ్కారీ శాఖలో అధికారిగా ఎదిగారు. ఈ విషయాన్ని పవన్ కూడ పలుమార్లు వేదికల మీద అన్నారు. బహుశా ఇదే ఆ పాత్ర చేయడానికి ఆయన్ను మోటివేషన్ చేసి ఉండవచ్చు.  అంతేకాదు పవన్ తన తల్లి బ్యాక్వర్డ్ కాస్ట్ నుండి వచ్చారని గతంలో ఒకసారి అన్నారు. ఈ కథలో కూడ హీరో వెనుకబడిన కులానికి చెందిన మహిళనే ఆదర్శ వివాహం చేసుకుంటాడు. ఇది కూడ పవన్ ను కదిలించి ఉండవచ్చు. ఇలా అయ్యప్పన్ నాయర్ క్యారెక్టర్ పలు విషయాల్లో తన తండ్రికి దగ్గరగా ఉండటంతో పవన్ సినిమా చేయడానికి ఆసక్తి చూపించి ఉండవచ్చు.