భార్యాభర్తలు అన్యోన్యంగా ఉంటే చూడడానికి ముచ్చటగా ఉంటుంది. అలా కాకుండా చీటికిమాటికి చిరాకు పడుతూ గొడవలు పడుతుంటే చాలా అసహ్యంగా ఉండడమే కాకుండా మీ కుటుంబం సర్వనాశనం అవుతుంది. దాంపత్య జీవనం సాఫీగా సాగిపోవాలంటే దంపతుల మధ్య ప్రేమానురాగాలు, నమ్మకం, ఆప్యాయతతో పాటు శారీరక తృప్తి కూడా ఎంతో అవసరం. శారీరక శ్రమ, పని ఒత్తిడి, ఆరోగ్యం ఇలా రకరకాల కారణాలతో చాలామంది స్త్రీలు తమ భర్తలను పడకగదిసుఖానికి దూరం చేస్తుంటారు ఫలితంగా తమ దాంపత్య జీవితాన్ని స్వతహాగా నాశనం చేసుకుంటున్నారని నిపుణులు చెబుతున్నారు.
భార్యాభర్తలు రోజంతా ఎలా ఉన్నా రాత్రి పడక గదిలో మాత్రం ఎలాంటి మొహమాటం లేకుండా ఏకాంతంగా సరదాగా గడపాలి.ముఖ్యంగా భార్యలు భర్తలతో ఆ విషయంలో సరదాగా ఉండరు. ఈ రోజుల్లో పరిస్థితుల కారణంగా అన్ని రోజులు సాధ్యం కాదు కానీ కనీసం వారంలో ఒకటి రెండు రోజులు అయినా ఖచ్చితంగా భార్య భర్తతో ఆ విషయంలో సరదాగా, సంతోషంగా గడపాలి. అలా కాకుండా భార్య భర్తను దూరం పెడుతుంటే భర్తల్లో లేనిపోని అపోహలకు అనుమానాలకు దారి తీయవచ్చు. ఫలితంగా సంసార జీవితంలో ఆగాదం ఏర్పడుతుంది.
సాధారణంగా స్త్రీలు ఆ విషయంలో కొంత మొహమాటం, బెరుకు ఉంటుంది. మీరే ఆమెను అర్థం చేసుకొని ఆమె పట్ల సున్నితంగా వ్యవహరించాలి. శారీరక తృప్తి విషయంలో తొందరపాటు అస్సలు పనికిరాదు. పెళ్లికి ముందు ఒక వాతావరణంలో పెరిగిన స్త్రీలు పెళ్లయిన తర్వాత మరో వాతావరణంలో జీవించాలి. అందుకే వాళ్లకు ఒక్కోసారి ఆ పని విషయంలో అంత ఆసక్తి ఉండదు. పెళ్లయిన తర్వాత కూడా కొన్ని భయాలు వాళ్లను వెంటాడుతుంటాయి. భర్తగా నీ భార్య భయాలను పోగొట్టి ఆమెను ప్రేమగా చూసుకోవాల్సిన బాధ్యత మీదే. పడకగదిలో మీ భార్య పట్ల చిరాకు పడకుండా
ప్రేమగా మాట్లాడుతూ ముగ్గులోకి దించాలి. ప్రేమగా మాట్లాడి వాళ్లకు ఆ పని అంటే ఆసక్తి కలిగేలా చేయాలి. అప్పుడే భార్యలు కూడా ఆ పని చేయడానికి ఆసక్తి చూపి మీ పట్ల నమ్మకం, ప్రేమ అనురాగాలను పంచడానికి సిద్ధపడుతుంది.