మయోనీస్ తో చేసిన వంటకాలు తింటున్నారా.. ఈ విషయాలు తెలిస్తే షాకవ్వాల్సిందే!

మనలో చాలామంది మయోనీస్ ను ఎంతో ఇష్టంగా తింటారు. సాస్‌, కెచప్‌, మయోనీస్‌ వాడకం ఈ మధ్య కాలంలో ఎక్కువైందనే సంగతి తెలిసిందే. వీటిని ఎక్కువకాలం నిల్వ ఉంచడానికి ప్రిజర్వేటివ్స్‌, ఫుడ్‌ కలర్స్‌, ఆర్టిఫీషియల్‌ ఫ్లేవర్స్‌ ఎక్కువగా ఉపయోగిస్తారు. వీటిని ఎక్కువగా వాడటం వల్ల ఆరోగ్యానికి నష్టమే తప్ప లాభం ఉండదు. చక్కెర, నూనె లేదా కొవ్వు పదార్థాలు అధికంగా వాడటం ద్వారా అనవసరమైన క్యాలరీలు కూడా లభిస్తాయి.

సరైన విధంగా నిల్వ చేయని పక్షంలో హానికారక సూక్ష్మజీవులు చేరి ఫుడ్‌ ఇన్ఫెక్షన్స్‌ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సాస్‌, మయోనీస్‌ వంటివి పరిమితంగానే ఉపయోగిస్తే మంచిది. తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఆరోగ్య సమస్యల బారిన పడకుండా ఉండవచ్చు. ఫాస్ట్ ఫుడ్‌కి కాంబినేషన్‌గా దీన్ని ఎక్కువగా వినియోగిస్తారని చెప్పవచ్చు.

సలాడ్స్ లో కూడా ప్రస్తుతం మయోనీస్‌ని యాడ్ చేసుకుని తినేవాళ్ల సంఖ్య పెరుగుతోంది. మయోనీస్‌లో కేలరీలు, కొవ్వులు అనేవి ఎక్కువగా ఉంటాయని చెప్పవచ్చు. మయోనీస్‌ని ఆయిల్, గుడ్లు, సోడియం, ఘాటు ఎక్కువగా ఉండే మసాలాలతో తయారు చేస్తారని చెప్పవచ్చు. కొవ్వులు ఎక్కువగా ఉన్న ఆహారాలు తీసుకోవడం ద్వారా బీపీ, షుగర్ వంటి సమస్యలు వచ్చే ఛాన్స్ ఉంటుంది.

మయోనీస్ వంటి హై ఫ్యాట్ అండ్ హై కేలరీ ఫుడ్ తీసుకోవడం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ అనేది అధికంగా పెరిగే అవకాశాలు ఉంటాయి. సంతృప్త, ట్రాన్స్ ఫ్యాట్‌లను కలిగి ఉండే కూరగాయల నూనెలతో తయారు చేస్తారని చెప్పవచ్చు.