బీట్ రూట్ ఎక్కువగా తినేవాళ్లకు షాకింగ్ న్యూస్.. ఎక్కువగా తింటే మాత్రం ప్రమాదమే!

మనలో ఎక్కువమంది తినడానికి ఇష్టపడని వంటకాలలో బీట్ రూట్ ఒకటి. బీట్‌రూట్‌ను ఎక్కువగా తినడం వల్ల కడుపు ఉబ్బరం, గ్యాస్, అజీర్తి, విరేచనాలు వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అలెర్జీ ఉన్నవారికి బీట్‌రూట్ తినడం వల్ల చర్మంపై దద్దుర్లు, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. బీట్‌రూట్ తినడం వల్ల కాలేయ సమస్యలు ఉన్నవారికి బీట్‌రూట్‌లోని కాపర్, ఐరన్ కారణంగా సమస్యలు మరింత పెరుగుతాయి.

షుగర్ తో బాధ పడేవాళ్లు బీట్‌రూట్ తీసుకోకూడదు. తక్కువ రక్తపోటు ఉన్నవారు లేదా ప్రస్తుతం రక్తపోటు మందులు తీసుకుంటున్న వారు బీట్‌రూట్ తినే ముందు ఆరోగ్య సంరక్షణ నిపుణులతో మాట్లాడి మాత్రమే బీట్ రూట్ తీసుకోవాలి. బీట్‌రూట్ రసాన్ని అధికంగా తీసుకోవడం వల్ల ఉబ్బరం లేదా విరేచనాలు వంటి జీర్ణశయాంతర అసౌకర్యాన్ని అనుభవించే అవకాశాలు అయితే ఉంటాయి.

బీట్‌రూట్‌లు తినడం లేదా వాటి రసం తాగడం వల్ల మీ పీరియడ్స్ సమయంలో రక్త ప్రవాహం పెరిగే ఛాన్స్ ఉంటుంది. బీట్ రూట్ ఎక్కువగా తీసుకుంటే మాత్రం శరీరంపై దుష్ప్రభావాలు పడే అవకాశాలు ఉంటాయి. రక్తహీనత సమస్యతో బాధ పడేవాళ్లకు మాత్రం బీట్ రూట్ దివ్యౌషధంగా పని చేస్తుందని చెప్పవచ్చు. తక్కువ రక్తపోటు ఉన్నవాళ్లకు బీట్ రూట్ సురక్షితం కాదు.

కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధ పడేవాళ్లు సైతం బీట్ రూట్ కు దూరంగా ఉండాలి. అలర్జీ సమస్యలు ఉన్నవాళ్లు సైతం బీట్ రూట్ కు దూరంగా ఉండాలి. జీర్ణ సంబంధిత సమస్యలతో బాధ పడేవాళ్లు సైతం బీట్ రూట్ కు వీలైనంత దూరంగా ఉంటే మంచిదని చెప్పవచ్చు.