ఈ మధ్య కాలంలో అల్లం, వెల్లుల్లి వినియోగం అంతకంతకూ పెరుగుతోంది. అల్లం, వెల్లుల్లిని వేర్వేరుగా కొనుగోలు చేయడం కంటే రెండింటి మిశ్రమంతో తయారైన అల్లం వెల్లుల్లి పేస్ట్ ను వినియోగించడానికి చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు. కొంతమంది అల్లం వెల్లుల్లి పేస్ట్ ను ఫ్రిడ్జ్ లో నిల్వ చేస్తున్నారు. అయితే అల్లం వెల్లుల్లిని వినియోగించే వాళ్లు కొన్ని విషయాలను కచ్చితంగా గుర్తుంచుకోవాలి.
అల్లంను ఫ్రిడ్జ్ లో ఉంచేవాళ్లు అల్లంను శుభ్రంగా కడిగి మాత్రమే ఫ్రిడ్జ్ లో ఉంచాలి. వెల్లుల్లిని ఫ్రిడ్జ్ లో ఉంచితే మొలకలు వచ్చే అవకాశం ఉండటంతో పాటు వెల్లుల్లి వాసన ప్రభావం ఇతర కూరగాయలపై పడే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. కొంతమంది అల్లం వెల్లుల్లి పేస్ట్ ను ఫ్రిడ్జ్ లో పెడుతూ ఉంటారు. అయితే ఒకసారి ప్యాకెట్లను ఓపెన్ చేసిన తర్వాత ఎక్కువ సమయం పాటు ఫ్రిడ్జ్ లో ఉంచకూడదు.
ఒకవేళ ఫ్రిడ్జ్ లో ఉంచితే మాత్రం అల్లం వెల్లుల్లి పేస్ట్ త్వరగా చెడిపోయే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఇంట్లో ఫ్రిడ్జ్ లేని వాళ్లు అప్పటికప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ను తయారు చేసుకుంటే మంచిది. ఒక కప్పు అల్లానికి, రెండు కప్పుల వెల్లుల్లి జోడించి పేస్ట్ చేసుకుంటే ఆ పేస్ట్ ఎక్కువ కాలం పాటు నిల్వ ఉంటుందని చెప్పవచ్చు. అల్లం వెల్లుల్లి పేస్ట్ ను ఎక్కువగా వాడే వాళ్లు ఈ విషయాలను గుర్తుంచుకోవాలి.
అల్లం వెల్లుల్లి పేస్ట్ ను అవసరానికి అనుగుణంగా మాత్రమే వాడాలి. మరీ ఎక్కువ మొత్తం వాడటం వల్ల నష్టమే తప్ప లాభం ఉండదు. ఫ్రిడ్జ్ లేని వాళ్లు ఎప్పటికప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ను తయారు చేసుకుని వాడటం మంచిది.