నిరుద్యోగులకు ఎస్బీఐ తీపికబురు.. భారీ వేతనంతో 2000 పీవో ఉద్యోగ ఖాళీలు!

దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరేలా తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఎస్బీఐలో పీవో ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. డిగ్రీ పాసై ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వాళ్లకు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా ఎంతగానో ప్రయోజనం చేకూరనుంది. ఆన్ లైన్ లో ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుంది.

సెప్టెంబర్ నెల 7వ తేదీ నుంచి సెప్టెంబర్ నెల 27వ తేదీ వరకు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఈ ఉద్యోగ ఖాళీలలో ఎస్సీ కేటగిరీ అభ్యర్థులకు 300 ఉద్యోగ ఖాళీలు ఉండగా ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు 150, ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు 540, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అభ్యర్థులకు 200, అన్ రిజర్వ్డ్ ఉద్యోగ ఖాళీల భర్తీకి 810 ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి.

ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు 41,960 రూపాయల బేసిక్ పేతో పాటు ఇతర సౌకర్యాలు అదనంగా లభించనున్నాయి. 2023 సంవత్సరం ఏప్రిల్ 1వ తేదీ నాటికి 30 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హత కలిగి ఉంటారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగులు, ఎక్స్ సర్వీస్ మేన్ లకు వయో సడలింపులు లభించే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.

ప్రిలిమినరీ పరీక్ష, మెయిన్ పరీక్ష, సైకోమెట్రిక్ టెస్ట్, గ్రూప్ ఎక్సర్ సైజ్, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, వైద్య పరీక్షల ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరగనుంది. జనరల్, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు 750 రూపాయలుగా ఉండగా మిగతా అభ్యర్థులకు మాత్రం ఎలాంటి దరఖాస్తు ఫీజు లేదు. హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ, కర్నూలు, గుంటూరులలో మెయిన్స్ పరీక్షను నిర్వహించనున్నారు.