దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిరుద్యోగులకు తీపికబురు చెప్పింది. మేనేజర్, ఆఫీసర్, క్లర్క్, ఎకనామిస్ట్, బ్యాంకింగ్ అడ్వైజర్ ఉద్యోగ ఖాళీల కోసం ఈ జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 1100 ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారని సమాచారం అందుతోంది. స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ ఎకనామిస్ట్ అండ్ డిఫెన్స్ బ్యాంకింగ్ అడ్వైజర్ ఉద్యోగ ఖాళీలకు జులై 17న రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ ఇతర ఉద్యోగ ఖాళీలకు జూలై 19, 2024న రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలైంది.
ఆగస్టు 8, 2024 వీపీ వెల్త్, మేనేజర్, ఇతర పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉందని సమాచారం అందుతోంది. మరోవైపు ఎస్బీఐ ఆఫీసర్స్/ క్లరికల్ కేడర్లో 8 విభాగాలు, క్రీడలకు స్పోర్ట్స్ పర్సన్ నియామకాల కొరకు జులై నెల 24వ తేదీన రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలు కాగా దరఖాస్తు ప్రక్రియ 2024 సంవత్సరం ఆగస్టు 14వ తేదీన ముగియనుంది. ఎస్బీఐ అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో అర్హత ఉన్న అభ్యర్తులు దరఖాస్తు చేసుకోవచ్చు.
జనరల్/ఈడబ్ల్యూఎస్/ఓబీసీ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు 750 రూపాయలుగా ఉంటుందని తెలుస్తోంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు ఎలాంటి దరఖాస్తు ఫీజును చెల్లించాల్సిన అవసరం లేదు. ఎస్బీఐ అధికారిక వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన ఇతర వివరాలను తెలుసుకోవచ్చు. ఈరోజే దరఖాస్తు చేసుకోవడానికి చివరి రోజు కాబట్టి అర్హత ఉన్నవాళ్లు వెంటనే దరఖాస్తు చేసుకుంటే మంచిది.
ఎస్బీఐలో ఉద్యోగం సాధించాలన్నది ఎన్నో లక్షల మంది కల కాగా ఆ కలను సులువుగా నెరవేర్చుకోవాలనుకుంటే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే మంచిది. నోటిఫికేషన్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన ఇతర వివరాలను తెలుసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.