ఏపీలో 50 సివిల్ జడ్జి ఉద్యోగ ఖాళీలకు నోటిఫికేషన్.. అత్యంత భారీ వేతనంతో?

హైకోర్టు ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు తీపికబురు చెప్పింది. సివిల్ జడ్జి జూనియర్ డివిజన్ ఉద్యోగ ఖాళీల కోసం ఈ జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. మార్చి నెల 17వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది. ఆన్ లైన్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. మొత్తం 50 ఉద్యోగ ఖాళీలకు ఈ జాబ్ నోటిఫికేషన్ రిలీజైంది.

సంబంధిత విభాగంలో లా డిగ్రీ ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. 2025 సంవత్సరం ఫిబ్రవరి 1వ తేదీలోపు 35 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్ లైన్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు 1500 రూపాయలుగా ఉంది.

ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు 750 రూపాయలుగా ఉండనుంది. ఈ ఏడాది ఫిబ్రవరి నెల 20వ తేదీ దరఖాస్తు ప్రారంభ తేదీగా ఉంది. 2025 సంవత్సరం మార్చి నెల 17వ తేదీ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు ఒకింత భారీ వేతనం లభించనుంది. వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు బెనిఫిట్ కలుగుతుంది.

లా చదివిన ఉద్యోగులకు ఈ జాబ్ ఆఫర్ బంపర్ ఆఫర్ అని చెప్పడంలో సందేహం అవసరం లేదు. రాతపరీక్ష ఆధారంగా ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. అఫీషియల్ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు.