కాళ్ల నొప్పుల వల్ల నిద్ర పట్టడం లేదా.. ఈ సమస్యకు చెక్ పెట్టే అద్భుత చిట్కాలు ఇవే!

కొన్ని సమస్యలు చిన్న సమస్యలే అయినప్పటికీ ఆ సమస్యల వల్ల ఎదురయ్యే ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. ప్రస్తుత కాలంలో వయస్సుతో సంబంధం లేకుండా చాలామందిని కాళ్లనొప్పుల సమస్య వేధిస్తోంది. కాళ్ల నొప్పుల వల్ల సరిగ్గా నిద్ర పట్టడం లేదని కొంతమంది వైద్యులను సంప్రదిస్తూ ఉంటారు. కొంతమందిలో రెస్ట్ లెగ్ లెగ్ సిండ్రోమ్ వల్ల కాళ్ల సంబంధిత సమస్యలు వస్తాయని చెప్పవచ్చు.

జన్యు సంబంధమైన కారణాల వల్ల కూడా ఈ సమస్య వస్తుంది. దురద, లాగడం, భరించలేని నొప్పి, పాదాలను సూదులతో గుచ్చినట్లు అనిపించడం ఈ వ్యాధి యొక్క లక్షణాలు అని చెప్పవచ్చు. కిడ్నీ ఫెయిల్యూర్, మధుమేహం, ఐరన్ లోపం వల్ల ఈ సమస్య ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉంటుంది. జలుబు, అలర్జీ మందులను ఎక్కువగా వినియోగించినా ఈ సమస్య బారిన పడే అవకాశాలు ఉంటాయి.

జీవనశైలిలో మార్పుల ద్వారా ఈ సమస్యకు చెక్ పెట్టే ఛాన్స్ ఉంటుంది. ఐస్ ప్యాక్, ఆవిరి స్నానాల ద్వారా ఈ సమస్యను దూరం చేసుకోవచ్చు. పోషకాహార లోపం లేకుండా ఆహారం తీసుకోవాలి. హీటింగ్ ప్యాడ్ లేదా ఐస్ ప్యాక్ ఉపయోగించడం ద్వారా మంచి ఫలితాలు ఉంటాయి. వైద్యులు సూచించిన మందులను వాడటం ద్వారా సమస్యకు శాశ్వతంగా చెక్ పెట్టవచ్చు.

సమస్య తీవ్రత మరీ ఎక్కువగా ఉంటే మాత్రం వైద్యుల సలహాలు, సూచనలు తీసుకుంటే మంచిదని చెప్పవచ్చు. అప్పుడప్పుడూ లెగ్ మసాజ్ లు చేయించుకోవడం ద్వారా కూడా మంచి ఫలితాలు ఉంటాయి. కాళ్ల నొప్పులతో బాధ పడేవాళ్లు ఈ చిట్కాలను పాటించడం ద్వారా ఉపశమనం పొందవచ్చు.