చలికాలంలో చిగుళ్ల సమస్యతో బాధ పడుతున్నారా.. ఈ సమస్యకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!

చలికాలంలో చాలామందిని వేధించే ఆరోగ్య సమస్యలలో చిగుళ్ల సమస్య ఒకటి కాగా ఈ సమస్య విషయంలో నిర్లక్ష్యం వహిస్తే కొన్నిసార్లు ప్రాణాలకే ప్రమాదం కలిగే అవకాశాలు అయితే ఉంటాయి. మన దేశంలో ప్రతిరోజూ ఎంతోమంది చిగుళ్ల సమస్యతో బాధ పడుతున్నారు. చిగుళ్ల సమస్య తీవ్రమైతే పంటినొప్పి కలుగుతుంది. కొన్ని ప్రాథమిక లక్షణాలు ఉంటే చిగుళ్ల సమస్యను గుర్తించడం సాధ్యమవుతుంది.

చిగుళ్లు ఎర్రగా వాచి ఉండటంతో పాటు ముట్టుకుంటే జివ్వుమంటుంటే ఆ లక్షణాన్ని జింజివైటిస్ అంటారు. చాలా సంవత్సరాల వరకు ఈ సమస్య వచ్చినప్పుడు లక్షణాలు బయటపడవు. చిగుళ్లలో పుండ్లు ఏర్పడటం, దంతాలు దూరంగా జరిగిపోవడం, దంతాల మధ్య సందులు పెరగడం లాంటి సమస్యలు ఉంటే పెరియోడాంటైటిస్ కారణమవుతుంది. నోటి దుర్వాసన సమస్య ఎక్కువగా ఉంటే కొన్నిసార్లు చిగుళ్ల సమస్య వల్ల ఈ సమస్య వస్తుంది.

బ్రష్ చేసినప్పుడు, ఏదైనా గట్టి వస్తువును కొరికినప్పుడు చిగుళ్ల నుంచి రక్తం కారితే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. నోటిలో ఎక్కువగా లాలాజలం ఊరుతున్నట్లు అనిపించినా జాగ్రత్త పడాలి. దంతలాపై నుంచి చిగురు కిందికి దిగుతున్నట్లుగా అనిపించినా చిగుళ్లపై బుడిపెల్లా వచ్చి చీము పట్టిన జాగ్రత్త పడాలి. ఫ్లోరైడ్ ఉన్న టూత్‌పేస్ట్ తో పళ్లను శుభ్రం చేసుకుంటే మంచిది. చక్కెర ఎక్కువగా ఉండే పదార్ధాలకు దూరంగా ఉండాలి.

మౌత్ వాష్ ను వినియోగిస్తే కెమికల్ క్లీనింగ్ కు ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పవచ్చు. మృదువైన బ్రిజిల్స్ ఉన్న బ్రష్‌నే ఉపయోగించాలి. రఫ్‌గా బ్రష్ చేసుకుంటే అది మీ చిగుళ్లకు హాని చేకూర్చే అవకాశం ఉంటుంది. చేత్తో చిగుళ్లపై మృదువుగా మసాజ్ చేసినట్లు రుద్దితే దంతాల సమస్యలు దూరమయ్యే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.