కాలి పిక్కలు పట్టేస్తున్నాయా.. ఈ సమస్యకు సులభంగా చెక్ పెట్టే చిట్కాలు ఇవే!

మనలో చాలామంది ఏదో ఒక సందర్భంలో కాలిపిక్కలు పట్టేయడం వల్ల ఇబ్బందులు పడుతుంటారు. ఈ సమస్య చిన్న సమస్యలా అనిపించినా ఈ సమస్య వల్ల ఎదురయ్యే ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. మంచు గడ్డలను ఒక గుడ్డలో వేసి మర్ధనా చేయడం వల్ల ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చు. జండూబామ్ ను నొప్పి ఉన్న చోట అప్లై చేయడం ద్వారా కూడా ఈ సమస్య దూరమయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది.

ప్రతిరోజూ నిద్రకు ముందు 2 టీ స్పూన్ల అల్లం ర‌సం తీసుకోవడం ద్వారా ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చు. పాలలో అశ్వ‌గంధ చూర్ణం కలిపి తీసుకున్నా లేదా అశ్వగంధ ట్యాబ్లెట్లను తీసుకున్నా కూడా ఈ సమస్య దూరమవుతుంది. భోజనానికి ముందు ఉసిరి జ్యూస్ తాగడం వల్ల కూడా అనుకూల ఫలితాలను పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. పొటాషియం, మెగ్నిషియం లాంటి ఖనిజ లవణాలు ఉన్న ఆహారాలను తీసుకుంటే మంచిది.

పాలు, చేప‌లు, పాల‌కూర‌, ట‌మాటాలు, చిల‌గ‌డ దుంప‌లతో పాటు పెరుగు, అర‌టి పండ్లు, త‌ర్బూజా, క్యారెట్లు, నారింజ పండ్లు ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల కూడా అనుకూల ఫలితాలను పొందవచ్చు. అవ‌కాడోలు, జీడిప‌ప్పు, చింత‌పండు, అర‌టి పండ్లు ఆహారంలో భాగం చేసుకుంటే కూడా ఈ సమస్య దూరమవుతుంది. ఖనిజ లవణాలు ఎక్కువగా ఉండే ఆహారాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి.

60 ఏళ్లు పైబ‌డిన వారిని ఎక్కువగా ఈ సమస్య వేధిస్తుంది. లివ‌ర్ జ‌బ్బులు, కిడ్నీ వ్యాధులు, ర‌క్త‌నాళాలు పూడుకుపోవ‌డం, వెరికోస్ వీన్స్ సమస్యలతో పాటు ఫెరిఫెర‌ల్ న్యూరోప‌తి, పార్కిన్స‌న్‌ సమస్యలతో బాధ పడేవాళ్లను ఎక్కువగా ఈ సమస్య వేధిస్తుంది. ఈ చిట్కాలు పాటించినా ఫలితం లేకపోతే వైద్యులను సంప్రదించి చికిత్స చేయించుకుంటే మంచిదని చెప్పవచ్చు.