మనలో చాలామంది ఉప్పు ఎక్కువగా ఉన్న వంటకాలను తినడానికి ఇష్టపడతారు. ఉప్పు ఎక్కువగా ఉన్న వంటకాలను తీసుకోవడం ద్వారా ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ను పొందవచ్చని చాలామంది భావిస్తారు. అయితే ఉప్పు ఎక్కువగా తీసుకోవడం ద్వారా వేర్వేరు ఆరోగ్య సమస్యలు వేధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ప్రస్తుతం ఎక్కువమందిని వేధిస్తున్న ఆరోగ్య సమస్యలలో బీపీ ఒకటనే సంగతి తెలిసిందే.
ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల ఈ సమస్య వేధించే అవకాశాలు అయితే ఉంటాయి. వినడానికి ఆశ్చర్యంగా అనిపించినా ఉప్పు ఎక్కువగా తీసుకునే వాళ్లను మధుమేహం సమస్య కూడా వేధించే అవకాశం అయితే ఉంటుంది. మోతాదుకు మించి ఉప్పు తీసుకుంటే ఆరోగ్యానికి ఎన్నో నష్టాలు కలిగే అవకాశాలు అయితే ఉంటాయి. గుండెపోటు, కిడ్నీ సమస్యలకు సైతం ఉప్పు కారణమవుతుంది.
ఉప్పు ఎక్కువగా ఉన్న ఆహారాలను తీసుకుంటే మూత్ర సంబంధిత సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. శరీరంలో ఉప్పు శాతాన్ని తగ్గించుకోని పక్షంలో ఎన్నో ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. శరీరంలో వాపులు ఎక్కువగా ఉంటే మాత్రం ఉప్పు ఎక్కువగా తింటున్నారని అర్థం చేసుకోవాలి. ఆహారంలో ఉప్పు తగ్గించడం వల్ల వేర్వేరు ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చు.
ఉప్పు ఎక్కువగా తీసుకుంటే శరీరంలో నీరు త్వరగా అయిపోయే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. ఆహారంలో వీలైనంత ఉప్పును తగ్గిస్తే శరీరానికి ఎంతో మంచిది. ప్రతిరోజూ 1500 మిల్లీగ్రాముల కంటే తక్కువగా ఉప్పు తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిదని చెప్పవచ్చు.