ఇంట్లో దేవుడిని పుజించే సమయంలో అస్సలు చెయ్యకూడదని పొరపాట్లు ఇవే!

depositphotos_114980654-stock-photo-beautifully-decorated-pooja-thali-for

మనలో చాలామంది భక్తితో దేవుడిని పూజిస్తారనే సంగతి తెలిసిందే. దేవుడిని పూజించడం వల్ల శుభ ఫలితాలు పొందే అవకాశంతో పాటు మనపై దేవుడి అనుగ్రహం కచ్చితంగా ఉంటుందని చాలామంది ఫీలవుతారు. అయితే దేవుడిని పూజించే సమయంలో కొన్ని పనులు చేయడం వల్ల మంచి ఫలితాలు పొందితే మరికొన్ని పనులు చేయడం వల్ల శుభ ఫలితాలను పొందడం సాధ్యం కాదని చెప్పవచ్చు.

 

ప్రతిరోజూ భగవంతుడి ఎదురుగా దీపం వెలిగించడం వల్ల దేవుని అనుగ్రహం మనపై కచ్చితంగా ఉంటుందని చెప్పవచ్చు. దేవుడికి పూలు, పండ్లు సమర్పించడం వల్ల మంచి ఫలితాలు పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. పూజ చేసే సమయంలో నచ్చిన విధంగా కాకుండా తప్పనిసరిగా నియమనిబంధనలను పాటించాలి.

 

దేవుడిని పూజించే సమయంలో అగర్ బత్తీలను వెలిగిస్తామనే సంగతి తెలిసిందే. ఆ అగర్ బత్తీలను ఊదటం వల్ల చెడు ఫలితాలను పొందే అవకాశం ఉంటుంది. ధూపం వెలిగించిన తర్వాత ఊదటం లాంటి పనులను చేస్తే మంచి ఫలితాలను సొంతం చేసుకునే అవకాశం ఉంటుంది. భోజనం చేసిన తర్వాత పూజ చేయడం కూడా మంచిది కాదు. ఇలా చేస్తే చెడు ఫలితాలు పొందే ఛాన్స్ ఉంటుంది.

 

భోజనం చేసే సమయంలో ఉల్లిపాయలు తిని మంత్రాలను పఠించకూడదు. ఈ విధంగా చేయడం వల్ల కూడా నష్టం కలుగుతుంది. వినాయకుడిని తులసి ఆకులతో పూజించడం వల్ల చెడు ఫలితాలు కచ్చితంగా కలుగుతాయని చెప్పవచ్చు. స్నానం చేయకుండా తులసి చెట్టును పూజిస్తే చెడు ఫలితాలు కలిగే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. ఒక దీపం సహాయంతో మరో దీపం వెలిగించకూడదు.

 

గడ్డ కట్టిన, నీళ్లతో కూడిన నెయ్యిని పూజకు ఉపయోగించకూడదు. ఈ విధంగా చేయడం ద్వారా కూడా చెడు ఫలితాలు పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఏ కారణం చేతనైనా పూజ మధ్యలో వెళ్లకూడదు. ఈ విధంగా చేస్తే మాత్రం చెడు ఫలితాలు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.