30 ఏళ్ల తర్వాత పెళ్లి చేసుకుంటున్నారా.. ఈ విషయాలు తెలిస్తే మాత్రం షాకవ్వాల్సిందే!

ఈ మధ్య కాలంలో యువతీయువకులలో చాలామంది ఆలస్యంగా పెళ్లి చేసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఈ విధంగా లేట్ గా పెళ్లి చేసుకోవడం వెనుక వేర్వేరు కారణాలు ఉన్నాయి. మంచి ఉద్యోగం, సొంతంగా ఇల్లు, స్థలాలు ఉంటే మాత్రమే పెళ్లిపై ఆసక్తి చూపించాలని చాలామంది భావిస్తుండటం గమనార్హం. ఆలస్యంగా పెళ్లి చేసుకోవడం వల్ల బాధ్యతలు ఎక్కువ అయ్యే అవకాశాలు ఉంటాయి.

పెళ్లిని వాయిదా వేయడం వల్ల రాబోయే రోజుల్లో పెళ్లి ఖర్చు మరింత పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు. ఆలస్యంగా పెళ్లి చేసుకున్న వాళ్లకు పిల్లల్ని కనే విషయంలో ఇబ్బందులు తలెత్తుతాయి. పెళ్లి ఆలస్యం చేయడం వల్ల ఒత్తిడికి లోను కావడంతో పాటు ఇతర సమస్యలు వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. పెళ్లి విషయంలో కొంతమంది కట్నం వల్ల వివాహాన్ని ఆలస్యం చేస్తున్నారు.

అత్యాశకు పోయి జీవితాలను నాశనం చేసుకుంటున్న వాళ్ల సంఖ్య కూడా ఎక్కువగా ఉందని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. 30 ఏళ్ల తర్వాత పెళ్లి చేసుకోవడం వల్ల భాగస్వామితో గొడవలు జరిగే అవకాశాలు అయితే ఉంటాయి. పెళ్లి చేసుకునే వాళ్లు భాగస్వామి విషయంలో అభిప్రాయ బేధాలకు ఎలాంటి ఛాన్స్ ఇవ్వొద్దని కామెంట్లు వినిపిస్తున్నాయి.

పెళ్లి విషయంలో కొంతమంది భిన్నాభిప్రాయాలను కలిగి ఉంటారు. అయితే ఆలస్యంగా పెళ్లి చేసుకోవడానికి ప్రాధాన్యత ఇస్తే మాత్రం ఇబ్బందులు తప్పవని చెప్పవచ్చు.